Horoscope Today: ఈ రాశులపై చంద్రగ్రహణం ప్రభావం.. వ్యాపారులకు ఊహించని లాభాలు..

కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Written By: Chai Muchhata, Updated On : September 18, 2024 8:15 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తర భాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సూర్యుడు, శుక్రుడు, కేతువుల కలయికతో త్రిగ్రాహి ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలు ఉండనున్నాయి. అలాగే ఇదే రోజు చంద్ర గ్రహణంతో పాటు చంద్రుడు మీన రాశిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది.

మేష రాశి:
ఈ రాశి వ్యాపారులకు ఈరోజు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదనంగా ఉంటాయి. పాత ఒప్పందాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి.

వృషభ రాశి:
కొన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడుతాయి. సాయంత్రి స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి:
కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

కర్కాటక రాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహారాశి:
మనసు ఆందోళనగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకున్న ఫలితాలు ఉంటాయి.వ్యాపారులు కొత్త ఆదాయాన్ని పొందుతారు.

కన్య రాశి:
అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్ల మద్దతు పొందుతారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

తుల రాశి:
వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల అశాంతి నెలకొంటుంది.

వృశ్చిక రాశి:
ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. ఇంటి బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనస్సు రాశి:
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో ఉల్లాసంగా ఉంటారు. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి:
రోజూవారీ పనులుచేసేవారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని పెట్టుబడులు పెడుతారు. కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తిపై శుభవార్తలు వింటారు.

కుంభరాశి:
ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులపై ఇప్పుడు లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

మీనరాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.