Bigg Boss 8 Telugu: గత వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం పై ప్రేక్షకుల్లో బిగ్ బాస్ సీజన్ 8 పై ఎంతటి అసంతృప్తి నెలకొందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ ఎలిమినేషన్ ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా కాకుండా, విచిత్రంగా కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా జరిగింది. ఇదెక్కడి అన్యాయం అని బిగ్ బాస్ టీం పై విరుచుకుపడ్డారు ఆడియన్స్. కానీ శేఖర్ బాషా ప్రెస్ మీట్ లో అది నేను రిక్వెస్ట్ చేయడం వల్లే కంటెస్టెంట్స్ అందరూ నన్ను ఎలిమినేట్ చేసారు. నాకు నా భార్య, బిడ్డని చూడాలని అనిపించింది. అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో నాకు ఆహరం విషయంలో కూడా చాలా ఇబ్బంది కలిగింది. దాని వల్ల నాకు చక్కర వేసింది. ఆ వాతావరణం కి పూర్తిగా ఇమడలేకపోయాను, అందుకే కంటెస్టెంట్స్ ని అవకాశం ఉంటే నన్ను ఎలిమినేట్ చెయ్యండి, నాకు ఇంటికి వెళ్లాలని ఉంది అని చెప్పను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే రీసెంట్ గా శేఖర్ బాషా మరో వీడియో ని విడుదల చేసాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘చూసారా నా పరిస్థితి.
హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. గెడ్డం, మీసం ట్రిమ్మింగ్ చేసుకునే సమయం కూడా నాకు దొరకలేదు. నా భార్య ఇంకా హాస్పిటల్ లోనే ఉంది. నాకు బిడ్డ పుట్టాడు అనే విషయాన్ని తెలుసుకొని నా మిత్రులు, సన్నిహితులు అనేక ఫోన్ కాల్స్ చేసారు. కానీ నేను ఇలాంటి బిజీలో ఉండడం వల్ల ఎత్తుకోలేకపోతున్నాను. నన్ను అపార్థం చేసుకోకండి. బిగ్ బాస్ కి వెళ్లి రాగానే వీడికి బలుపు పెరిగిపోయింది అని అనుకోకండి. ఇంత బిజీ లో కూడా నేను కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను. కానీ కొన్ని మిస్ అవుతున్నాయి. ఒక రెండు రోజులు ఆగితే నేను పూర్తిగా ఫ్రీ అవుతాను. అప్పుడు కాల్స్ కి అందుబాటులో ఉంటాను’ అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా శేఖర్ బాషా ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆయనని ఎంతవరకు మిస్ అవుతున్నారో తెలియదు కానీ, ప్రేక్షకులు మాత్రం బాగా మిస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన వేసే జోకులను బాగా మిస్ అవుతున్నారు. రీ ఎంట్రీ ఉంటుందేమో అని అందరూ ఆశించారు కానీ, అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. అక్టోబర్ 4 వ తేదీన కొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు అడుగుపెట్టబోతున్నారు. అయితే గత సీజన్ లో ఎలిమినేట్ అయిన రతికా ఎలా అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు వచ్చిందో, ఈ సీజన్ లో కూడా శేఖర్ బాషా అలా వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వైల్డ్ కార్డు ద్వారా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లోపలకు మళ్ళీ రావాలంటే కనీసం నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిం వాడు అయ్యుండాలి, శేఖర్ బాషా కేవలం రెండు వారాలు మాత్రమే కొనసాగాడు కాబట్టి అతని రీ ఎంట్రీ దాదాపుగా అసాధ్యం.