Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై బుధవారం అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు.బుధవారం సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో రవియోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
పిల్లల విషయంలో కొంత ఆందోళన చెందుతారు. ఆహ్లదకరమై వాతావరణంలో గడుపుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారి మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం బహుమతి కొంటారు.
వృషభ రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి పెడుతారు. అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. స్నేహితుల సలహాలు పనికి వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.
మిథున రాశి:
వ్యాపారులు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులుకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది.
కర్కాటక రాశి:
కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. విద్యార్థుల చదువులో ఆటంకాలు ఏర్పడుతాయి. ఖాళీ సమయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల మద్దతు ఉంటుంది.
సింహారాశి:
కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆస్తిపై నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. ఉద్యో్గులు కార్యాలయాల్లో ఏకాగ్రతతో పనిచేయాలి. జీవిత భాగస్వామితో సరదాగా ఉంటారు.
కన్య రాశి:
వ్యాపారులు లాభాలు పొందే అవకాశం. కొత్త వ్యక్తులతో పరిచయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు ప్రత్యర్థులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. డబ్బు ఎవరికీ ఇవ్వకుండా ఉండాలి.
తుల రాశి:
ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు.
వృశ్చిక రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొన్ని విషయాల్లో సోదరుల మధ్య విభేదాలు ఉంటాయి. పిల్లలతో సరదాగా గడుపుతారు. ఏపని చేపట్టినా దానిని పూర్తి చేయడానికి కృషి చేయాలి.
ధనస్సు రాశి:
శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతీ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లయితే దానిని తొందరగా తీరుస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు వెతుక్కుంటారు.
మకర రాశి:
పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఇప్పటికే ఉన్న వాటిపై మంచి లాభాలు వస్తాయి. రోజూ వారీ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పెండింగ్ సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి.
కుంభరాశి:
కుటుంబ సభ్యుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. వివాహానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మీనరాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా పని మొదలు పెడితే పెద్దల సలహా తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండా
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More