Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఈ రాశుల గల జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆదివారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఇంద్రయోగం ఏర్పడనుంది. ఈ కారంా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేషంతో సహా మరికొన్ని రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఒత్తిడికి గురవుతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తి గురించి కొన్ని విషయాలు బహిర్గతం అవుతాయి.
వృషభ రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. రాజకీయ రంగాల్లో ఉండేవారికి అనుకూల వాతావరణం.
మిథున రాశి:
ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. ఇప్పటి వరకు ఏదైనా ఆందోళన ఉంటే ఈరోజుతో సమసిపోతుంది. విద్యార్థులు కొత్త కోర్సు నేర్చుకునేందకు ప్లాన్ చేస్తారు.
కర్కాటక రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు ఉంటాయి.
సింహారాశి:
ఉద్యోగులు కొన్ని కారణాల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు.
కన్య రాశి:
రాజకీయాల్లో ఉండేవారు అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరేవారికి అనుకూల సమయం.
తుల రాశి:
కొందరు శత్రువులు మత్రులుగా మారుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఇతరులకు డబ్బు సాయం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
వృశ్చిక రాశి:
వ్యాపారులు అధిక లాభాలు పొందేందుకు ప్రణాళిక వేస్తారు. సోదరుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడుతారు. వివాహం చేసుకోవాలనుకునేవారికి ప్రతిపాదనలు వస్తాయి.
ధనస్సు రాశి:
ఆర్థిక వ్యవహరాలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. కొందరు అనుకోకుండా డబ్బును కోల్పోవచ్చు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు దూరంగా ఉన్న వారు ఈరోజుతో దగ్గరవుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి:
కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలనుకుంటే అందుకు అనువైన సమయం ఇదే. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
శత్రువుల ఈ రాశిపై ఆధిపత్యం చెలయించే అవకాశం ఉంది. విద్యార్థులు కెరీర్ కోసం తీవ్రంగా కష్టపడుతారు. సీనియర్ల సాయంతో ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి:
ఈ రాశి వారు అనారోగ్యాల బారిన పడే అవకాశం. సాయంత్రం శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ పనులు ఉంటే ఈరోజు పూర్తి చేస్తారు. మానసికంగా ఆందోళనతో ఉంటారు.