Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ మొదయ్యాక తెలుగు వాళ్లంతా ఎలిమినేట్ కావడం.. కన్నడ బ్యాచ్ మిగిలిపోవడంతో ఎంటర్ టైన్ మెంట్ లేకుండా పోయింది. అందుకే వైల్డ్ కార్డ్స్ అంటూ మొత్తం కమెడియన్స్ ను దించేసింది బిగ్ బాస్. అయితే వారి కామెడీ టైమింగ్ బాగానే ఉన్నా ఆటలోకి వచ్చేసరికి తేలిపోతున్నారు. వీరి మధ్య ఇగోలు కూడా ఆటను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాయి. హరితేజ, నయని పావనీ లాంటి వారు అయితే రాయల్స్ లోనే రెబల్స్ గా మారారని నాగార్జున నిన్న ఇచ్చిపడేశాడు. ఓజీలు ఎంత కొట్టుకున్నా ఆట కోసం ప్రాణమిస్తున్నారని.. రాయల్స్ లో అదే లోపిస్తోందని సూచించాడు.
ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా పాత సీజన్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత షో రూపురేఖలు మారిపోయిన సంగతి తెలిసిందే. హౌస్ కి ఒక సరికొత్త కల వచ్చింది. మొదటి వారం నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ‘ఓజీ’ క్లాన్ గా, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ‘రాయల్’ క్లాన్ గా బిగ్ బాస్ విడదీసాడు. మొదటి రెండు వారాలు రాయల్ క్లాన్ హవా చాలా గట్టిగా నడించింది. వాళ్ళ క్లాన్ నుండి మెహబూబ్, గౌతమ్ మెగా చీఫ్స్ కూడా అయ్యారు. దీంతో ఓజీ క్లాన్ సభ్యులు రాయల్స్ ని తట్టుకోలేకపోతున్నారు అని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఈ వారం సీన్ మొత్తం మారిపోయింది. నిఖిల్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఓజీ క్లాన్ మొత్తం టాస్కులు విజృభించి ఆడారు. కేవలం నిఖిల్, పృథ్వీ కలిసి రాయల్ క్లాన్ మొత్తాన్ని చిత్తుచిత్తుగా ఓడించారు. అటు వైపు నుండి మెహబూబ్, గౌతమ్ వంటి బలమైన ఫిజికల్ టాస్కులు ఆడే కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ, వాళ్లిద్దరూ కూడా పృథ్వీ ని తట్టుకోలేకపోవడం గమనార్హం.
ఇక ఈ వారం మెహబూబ్ ఎలిమినేషన్ తర్వాత రాయల్ క్లాన్ మరింత బలహీన పడింది. ఇప్పుడు రాయల్ క్లాన్ లో టాస్కులు బాగా ఆడే ఏకైక కంటెస్టెంట్ గా గౌతమ్ నిలిచాడు. కానీ ఇతగాడి మూడ్ స్వింగ్స్ అందరికీ తెలిసిందే. గేమ్ ఆడాలి అనుకుంటే చాలా గట్టిగా ఆడుతాడు, లేకపోతే అసలు ఆట రానివాడిలాగా ప్రవర్తిస్తాడు. పాపం యష్మీ, నిఖిల్ అయితే ఇతన్ని ఆటలో అరటిపండులాగా వాడుకుంటున్నారు. గౌతమ్ యష్మీ కి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. యష్మీ కి మాత్రం నిఖిల్ అంటే ఇష్టం. కేవలం నిఖిల్ ని ఉడికించడానికి యష్మీ గౌతమ్ తో బాగా క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తుంది. పాపం ఇక్కడ గౌతమ్ ఎమోషన్స్ తో అటు నిఖిల్ కి ఇటు యష్మీ కి అవసరం లేదు. ఇక రాయల్ క్లాన్ లో మిగిలిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే టేస్టీ తేజ, అవినాష్ గురించి మాట్లాడుకోవాలి.
వీళ్లిద్దరు బోలెడంత ఎంటర్టైన్మెంట్ ని ఇస్తున్నారు, అలాగే గేమ్స్ విషయం లో ప్రాణం పెట్టి ఆడుతున్నారు. కానీ వాళ్లిద్దరూ ఎంత ఆడినా కూడా నిఖిల్, పృథ్వీ, నబీల్ ని మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఇక నయనీ పావని అయితే ఆవేశం ఎక్కువ, ఆట తక్కువ అన్నట్టుగా ఇన్ని రోజులు ఆమె ప్రస్థానం కొనసాగింది. ఈ వారం ఆమె నామినేషన్స్ లోకి వస్తే అస్సాం ట్రైన్ పక్కా ఎక్కేస్తుంది. ఇక రోహిణి, హరి తేజ మధ్య చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది. వీళ్ళిద్దరిలో రోహిణి కేవలం ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే ఇవ్వగలదు, కానీ హరితేజ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదు, టాస్కులు కూడా బాగా ఆడగలదు. కానీ హరితేజలో మొదటి సీజన్ లో ఉన్న ఫైర్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇక గంగవ్వ విషయానికి వస్తే, బిగ్ బాస్ హౌస్ లో సోఫాలు,కుర్చీలు అయినా కంటెస్టెంట్స్ కి ఉపయోగపడుతున్నాయి. కానీ గంగవ్వ మాత్రం ఎవరికీ ఉపయోగ పడడం లేదు. కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా ఇస్తుందా అంటే ఈమె మాటలు జనాలకు అర్థం కావు. ఈమెని బిగ్ బాస్ టీం ఎందుకు తీసుకొచ్చారో కనీసం వాళ్ళకైనా క్లారిటీ ఉందా అని అనుమానం.
ఇలా రాయల్ క్లాన్ మొత్తం బలహీన పడింది. కానీ ఓజీ క్లాన్ సభ్యులు మాత్రం నిజంగా ఓజీలు అనిపించుకుంటున్నారు. వీళ్ళ మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ టాస్కులు వచ్చిందంటే అందరూ ఒక్కటిగా మారిపోతున్నారు. ఇలాగే ఆడితే టాప్ 5 మొత్తం ఓజీ క్లాన్ సభ్యులే ఉంటారని విశ్లేషకుల అభిప్రాయం.