https://oktelugu.com/

Horoscope Today:బ్రహ్మయోగం కారణంగా ఈ రెండు రాశుల వారికి అధిక లాభాలు..

ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడుజాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు తోటివాటి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 6, 2024 / 08:03 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు బ్రహ్మయోగం, రవిగయోగం ఏర్పడనుంది. దీంతో కన్య, మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడుజాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు తోటివాటి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

    వృషభ రాశి:
    కొందరు అహంకారంతో ఉంటారు. ఇలా ఉండడం వల్ల బంధువులు దూరమవుతారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    మిథున రాశి:
    బంధువులతో సంబంధాలు మెరుగుపడుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు.

    కర్కాటక రాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. భవిష్యత్ కు సంబంధించి విద్యార్థులు శుభవార్తలు వింటారు.

    సింహారాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఏదైనా పనిని నిర్ణయించుకున్నాక.. దానిని వెంటనే పూర్తి చేయాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    కన్య రాశి:
    ఉద్యోగులు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. కొన్ని పనుల్లో జాప్యం కారణంగా సీనియర్ల నుంచి చివాట్లు తింటారు. కుటుంబ సభ్యుల కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

    తుల రాశి:
    ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళంలో పడుతారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. దీంతో వారు సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామి కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు.

    వృశ్చిక రాశి:
    ఈ రాశి వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులు చాకచక్యంగా ఉండడం వల్ల కొన్ని సమస్యల నుంచి తప్పించుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

    ధనస్సు రాశి:
    ఈ రాశి వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. పని ప్రదేశంలో కొందరు వ్యతిరేక భావనతో ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

    మకర రాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పరమైన చిక్కుల్లో పడుతారు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

    కుంభరాశి:
    ఈ రాశి వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మీనరాశి:
    వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం కొన్ని విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.