https://oktelugu.com/

Star Heroine: చిరంజీవి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

ప్రస్తుతం చాలా మంది హీరోలు కొంచెం క్రేజ్ రాగానే భారీ రెమ్యూనరేషన్స్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారు...దాని వల్లనే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య గొడవలు వస్తు ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 08:41 AM IST

    Star Heroine

    Follow us on

    Star Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఒకానొక సందర్భంలో చిరంజీవిని మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో మెగాస్టార్ అనే ట్యాగ్ ను కూడా సంపాదించుకొని ప్రతి ఒకరికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. మరి అలాంటి చిరంజీవి ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి టాప్ హీరోగా ముందుకెళ్తున్న క్రమంలోనే చిరంజీవి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆవిడ ఎవరు అంటే విజయశాంతి… అవును విజయశాంతి ఒక సందర్భంలో స్టార్ హీరోలతో పాటు పోటీపడి మరి సినిమాలను చేసింది. ముఖ్యంగా దాసరి నారాయణరావు చేసిన ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ రావడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన నటి మరొక్కరు లేరనేంతలా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

    అలాంటి నటి తెలుగులో చిరంజీవికి సైతం సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను అందుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇండియాలోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకునే ముగ్గురు స్టార్లలలో అమితాబచ్చన్, రజనీకాంత్ తర్వాత మూడో ప్లేస్ లో విజయ శాంతి ఉండటం విశేషం…దాన్ని ప్రముఖ మ్యాగజైన్ సంస్థ రాసిందని విజయశాంతి గారు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని చెప్పారు. మరి చిరంజీవి లాంటి స్టార్ హీరోకి కూడా సాధ్యం కానీ రీతిలో విజయశాంతి రెమ్యూనరేషన్ తీసుకుంది అంటే అప్పుడు ఆమె క్రేజ్ ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు.

    ఇక ఆ తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హీరోయిన్ గా కొనసాగి మెయిన్ లీడ్ క్యారెక్టర్ లను కూడా పోషించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ఆ తర్వాత ఆమెకు మరుసగా ప్లాపులు రావడంతో ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయారు. ఇక అదే సమయంలో ఆమె పాలిటిక్స్ లో చాలా బిజీగా కొనసాగుతూ ముందుకు సాగింది. ప్రస్తుతం ఆమె పాలిటిక్స్ లో మంచి గుర్తింపును సంపాదించుకునే క్రమంలో ఉంది.

    ఇక ఇదిలా ఉంటే ఆమె మళ్లీ సినిమాల్లో కూడా నటిస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకుముందు మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆమె చేసిన పాత్రకి మంచి గుర్తింపు లభించింది. ఇక దాంతో కొంత గ్యాప్ తీసుకొని ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు…