Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 14న ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. గురువారం చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా మకర రాశి వారు ఇతరులకు వాగ్దానం ఇవ్వడం వల్ల నష్టపోతారు. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొన్ని పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. ఇతరుల అభిప్రాయాలు తీసుకుంటారు. వ్యాపారులకు అనుకూలమైన రోజు.
వృషభ రాశి:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్లే అవకాశం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తారు.
మిథునం:
వ్యాపార లక్ష్యాన్ని సాధించడం కోసం భాగస్వామ్యం చేసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఇబ్బందులకు గురి చేయొచ్చు. ఉద్యోగులు బాధ్యతలను నెరవేరుస్తారు.
కర్కాటకం:
కొన్ని లక్ష్యాలపై దృష్టి పెడుతారు. వ్యాపారంలో సమస్యలు ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహ:
ఈ రాశివారు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ప్రత్యర్థులు మీపై విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
మనసులో గందరగోళం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకుంటారు.
తుల:
ఈ రాశి వారు ఈరోజు శక్తివంతంగా ఉంటారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. స్నేహితుల్లో ఒకరి నుంచి ముఖ్యమైన సమాచారం పొందుతారు.
వృశ్చికం:
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని కార్యక్రమాలను అంకితభావంతో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్ని శుభవార్తలు వింటారు.
ధనస్సు:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇంటికి కొందరు అతిథులు రావొచ్చు. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
మకర:
దీర్ఘ కాలిక ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వైద్యుల వద్దకు వెళ్లాలి. ఎవరికీ అనవసర వాగ్దానాలు చేయొద్దు.
కుంభం:
అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
కొత్త పెట్టటుబడులు లాభిస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఓ శుభవార్త వింటారు. కుటంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి.