Homeఎంటర్టైన్మెంట్Actress Divi : రవితేజ సరసన లీడ్ క్యారెక్టర్ అన్నారు.. బాత్రూం షవర్ కింద నోరు...

Actress Divi : రవితేజ సరసన లీడ్ క్యారెక్టర్ అన్నారు.. బాత్రూం షవర్ కింద నోరు మూసుకొని ఏడ్చాను..

Actress Divi : ఇవి సావిత్రి రోజులు కాదు. తెలుగు అని చెప్పగానే ఎర్ర తివాచీ పరిచే దర్శకులు అంతకన్నా లేరు. వేదిక మీద యంగ్ టాలెంట్ అని ఏదో మాటలు చెప్తారు కానీ.. వాస్తవంలో అంత సన్నివేశం ఉండదు. కేవలం మలయాళీ, హిందీ, తమిళ్ వాళ్లకే మనవాళ్లు జై కొడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా అవకాశాలు రాక.. ఒకవేళ ఇచ్చినా.. అవి నిలబడక.. చాలామంది తెలుగు నటీమణులు సినిమాకు గుడ్ బై చెప్పారు. కొంతమంది అవకాశాల కోసం ఇతర చిత్ర పరిశ్రమల వైపు వెళ్లారు. అక్కడ కూడా రిక్త హస్తమే ఎదురు కావడంతో చేసేదేం లేక సైలెంట్ అయిపోయారు. తాజాగా ఇలాంటి అనుభవమే యువ నటికి ఎదురైంది. ఆ స్టోరీ మొత్తం విన్నాకా జాలి పడటం తప్ప.. చేసేదేం లేకుండా పోయింది.

అప్పట్లో బిగ్ బాస్ షో లో దివి అనే యువతి మెరిసింది. ఆ యువతి ఆటతీరుకు చిరంజీవి లాంటి నటుడు ఫిదా అయిపోయారు. ఆ వేదిక మీదనే ఆమెకు మాట ఇచ్చారు. తన సినిమాలో అవకాశం ఇస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే గాడ్ ఫాదర్ అనే సినిమాలో ఒక రోల్ ఇచ్చారు. ఆ తర్వాత దివి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాట కూడా చేశారు. కానీ ఆ తర్వాత దివి ప్రయాణం కేక్ వాక్ కాలేదు. ఇప్పటికీ అవకాశాల కోసం ఆమె ఇబ్బంది పడుతూనే ఉంది. మొదట్లో మోడల్ చేసిన దివి.. తర్వాత యాక్టింగ్ వైపు వచ్చింది. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. లావుగా ఉంటే సన్నగా అవ్వాలని, సన్నగా ఉంటే లావు అవ్వాలని.. ఇలా రకరకాల కండిషన్లు పెట్టారు. అయినప్పటికీ తను వాటికి ఒప్పుకుంది. తన శరీర ఆకృతిని అలాగే మార్చుకుంది. తీరా వారి వద్దకు వెళ్ళిన తర్వాత.. రేపు ఫోన్ చేస్తాం, మాపు ఫోన్ చేస్తాం, అందుబాటులో ఉండండి అంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. ఇలా ఎన్నోసార్లు ఇలాంటి ఫలితాలు ఎదురు కావడంతో దివి లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది.

ఇటీవల రవితేజతో లీడ్ క్యారెక్టర్ లో నటించే ఒక పాత్రకు దివి ని ఎంపిక చేశారు. ఐదు రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ లోగానే రాత్రికి రాత్రి ఫోన్ చేసి “నిన్ను మార్చామంటూ” దివికి చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో దివి ఒక్కసారి గా ఆందోళన చెందింది. ” ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. చాలామంది నీ నటన బాగుంది అన్నారు. నీ హైట్, ఫిజిక్ సినిమాకు ఎసెట్ అన్నారు. తీరా చూస్తే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేవారు. ఇలా ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. మంచంపై పడుకొని.. దిండు ముఖంపై పెట్టుకొని ఎన్నోసార్లు ఏడ్చాను. బాత్ రూం షవర్ కింద తలపెట్టి నోరు మూసుకొని ఏడ్చాను. అమ్మానాన్నలకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు. ఒక పాటలో నేను సరిగ్గా డ్యాన్స్ చేయలేదని కొంతమంది కామెంట్స్ చేశారు. నాకు అవకాశాలు వస్తే అనుభవం వస్తుంది.. నేను ఇంకా కెరియర్లో నిలదొక్కుకోలేదు. అప్పటికే నా మీద మాటల దాడి మొదలుపెట్టారంటూ” దివి వాపోతోంది.. మరి రవితేజ సినిమాకు సంబంధించి అవకాశం ఇచ్చిన ఆ డైరెక్టర్ ఎవరు? రాత్రికి రాత్రే దివి ని ఎందుకు మార్చారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించవు. ఎందుకంటే ఇది తెలుగు చిత్ర పరిశ్రమ.. నటనకంటే మిగతా విషయాలకే ఇక్కడ ప్రాధాన్యం ఎక్కువ. అర్థం చేసుకున్న వాళ్లకి అర్థం చేసుకున్నంత.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular