Horoscope Today: గ్రహాల మార్పులతో రాశులపై రాశులపై ప్రభావం ఉంటుంది. ఈ రాశుల కలిగిన వారిలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ధన్ త్రయోదశి పండుగ సందర్భంగా కొన్ని రాశులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే?
మేష రాశి:
ఈ రాశి వారిపై ధన్ త్రయోదశిత ప్రభావం ఉండనుంది. బంధువుల నుంచి డబ్బు సాయం అందుతుంది. అయినంత మాత్రాన అందరినీ నమ్మాల్సిన అవరం లేదు. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆలోచించాలి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
వృషభ రాశి:
వ్యాపారులు పెట్టుబుడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఏవైనా వివాదాలు ఉంటే ఈరోజుతో సమసిపోతాయి. ఇరుగుపొరుగువారికి సాయం చేస్తారు.
మిథున రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. కష్టమైన కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు అధిక లాభం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు.
కర్కాటక రాశి:
ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి శుభవార్త అందుతుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు.
సింహారాశి:
జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఉద్యోగులు సీనియర్లతో గొడవలు పడే అవకాశం. వ్యాపారులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కన్య రాశి:
ఈ రాశి వారికి శత్రువుల బెడద ఉండే అవకాశం. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాతో కొత్త పెట్టుబడులు పెడుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
తుల రాశి:
ఈ రాశి వారిపై లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉండనుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చిక రాశి:
తల్లిదండ్రుల మద్దతుతో ఉన్నత విద్య కోసం మార్గం పడుతుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువే.
ధనస్సు రాశి:
కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేవారు ఆలోచించాలి. ఈరోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు.
మకర రాశి:
సాయంత్రం కొత్త వ్యక్తులను కలుస్తారు. అనసవర వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. మధ్యాహ్నం కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
కుంభరాశి:
ఉద్యోగులు శుభవార్త వింటారు. జీతం పెరుగుదలకు అవకాశం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతున్నా.. ఖర్చులు ఉంటాయి. కొన్ని పనులను శత్రువులు అడ్డుకునే అవకాశం.
మీనరాశి:
వ్యాపారులు అనుకోకుండా అధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదానికి దిగుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో కృషి చేస్తారు. డబ్బు విషయంలో కొందరితో వాగ్వాదం ఉంటుంది.