JEE Mains 2025: జేఈఈ మెయిన్స్‌ – 2025 షెడ్యూల్‌ విడుదల.. ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ!

జేఈఈ మెయిన్స్‌ 2025 సెషన్‌ 1, సెషన్‌ 2 తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సోమవారం ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్‌ను jeemain.ntaలో అందుబాటులో ఉంచింది.

Written By: Raj Shekar, Updated On : October 29, 2024 8:01 am

JEE Mains 2025

Follow us on

JEE Mains 2025: జేఈఈ మెయిన్స్‌ – 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈమేరకు పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం(అక్టోబర్‌ 28న) విడుదల చేసింది. రెండు సెషన్లుగా ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. జేఈఈ మెయిన్‌–1 2025, జనవరిలో జరుగనుండగా, సెషన్‌ – 2 పరీక్షలు ఏప్రిల్‌ 2025లో నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. జనవరి సెషన్‌కు సంబంధించి అక్టోబర్‌ 28, 2024 నుంచే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభించింది. నవంబర్‌ 22 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఈమేరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 22 నుంచి31 వరక నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేస్తామని ఎన్‌టీఏ తెలిపింది.

రెండు పేపర్లు..
జేఈఈ మెయిన్స్‌లో రెండు పేపర్ల ఉంటాయి. పేపర్‌–1( బీఈ, బీటెక్‌)ను ఎన్‌ఐటీ, ఐఐటీ, సీఎఫ్టీఐ, యూనివర్సిటీలు ఇతర 6పముఖ సంస్థల్లో అండగర్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ బీఈ, బీటెక్‌ ప్రవేశాలకు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌ పేపర్‌–1ను జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత పరీక్షగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హతతో ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ మెయిన్స్‌ పేపర్‌ – 2తో బీఆర్క్, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ ఆధారంగా ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 13 భాషల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

షెడ్యూల్‌ ఇలా..

– ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పణ 28 అక్టోబర్‌ నుంచి నవంబర్‌ 22 వరక అవకాశం ఉంది.

– ఫీజు చెల్లింపునకు గడవు 2024 నవంబర్‌ 22 వరకు చెల్లించాలి.

– పరీక్ష కేంద్రాల ప్రకటన 2025 జనవరి తొలివారంలో ప్రకటిస్తారు. .

– అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ పరీక్షకు 3 రోజుల ముందు విడుదల చేస్తారు.