https://oktelugu.com/

Gold : ప్రవాహంలా బంగారం.. దక్కించుకోవడానికి ప్రజల పోటీ.. ఇంతకీ ఇవి ఎక్కడంటే..

బలమైన బండలు.. దృఢమైన కొండలు.. వాటిపైన చెట్లు.. చుట్టూ ఇలాంటి వాతావరణం.. జీవితాంతం అక్కడే ఉండాలనిపిస్తుంది. దానికి తోడు గలగలా పారే నీరు.. ఆ నదుల్లో చాలామంది దేనికోసమో వెతుకుతున్నారు. దొరికిన వారు ప్రపంచాన్ని జయించినంత సంబరపడుతున్నారు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోందంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 29, 2024 / 07:12 AM IST

    Gold Searching In River

    Follow us on

    Gold :  భూమిలో చోటు చేసుకున్న మార్పుల వల్ల.. భూ అంతర్గత పొరల్లో రసాయనిక చర్యల వల్ల లోహాలు ఏర్పడతాయని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా.. మనం ఉపయోగించే లోహాలు మొత్తం భూమి ద్వారా లభించినవే. అందులో బంగారం కూడా ఒకటి. ఈ భూమ్మీద అత్యంత ఖరీదైన లోహం కూడా బంగారమే. అయితే ఈ బంగారం శుద్ధి చేస్తేనే స్వర్ణం అవుతుంది. దానికి మరిన్ని మెరుగులు దిద్దితేనే ఆభరణం అవుతుంది. అయితే ఈ బంగారం భూమి మీద అత్యంత తక్కువగా లభిస్తుంది. అందువల్లే బంగారం విస్తరించి ఉన్న ప్రాంతాలు సంపన్న దేశాలుగా విలసిల్లుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో బంగారం రేణువుల రూపంలో లభిస్తోంది. దానిని పట్టుకోవడం కోసం ప్రజలు వలలు వేస్తున్నారు. జల్లెడ పడుతున్నారు.

    ఇక్కడ బంగారం లభిస్తుంది

    అమెరికాలోని మిస్సోరి నదికి విశేషమైన పేరు ఉంది. ఈ నది ఇసుకలో బంగారు రేణువులు ఉంటాయని ప్రజలు నమ్ముతుంటారు. ఈ నది ప్రవాహంలో ఇసుక రేణువులలో బంగారం కోసం ప్రజలు గాలిస్తుంటారు. 19వ శతాబ్దం నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఇసుక రేణువులలో బంగారం లభిస్తుంది. గాలింపులో బంగారం దొరికిన వారు విక్రయించి సొమ్ము చేసుకుంటారు.

    కెనడాలోని కిలో డైక్ అనే నదిలో కూడా బంగారం లభిస్తుంది. గతంలో దాన్ని చుట్టూ జరిపిన తవ్వకాలలో బంగారం రేణువుల రూపంలో లభించింది. అప్పటినుంచి ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలు బంగారం కోసం విస్తారంగా గాలింపు చేపడతారు.

    స్వర్ణ రేఖా నది

    భారత్లోని జార్ఖండ్ రాష్ట్రంలో స్వర్ణ రేఖ పేరుతో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది ప్రవాహంలో బంగారు రేణువులు లభిస్తుంటాయి. వర్షాకాలం ముగిసిన తర్వాత, నదీ ప్రవాహం తగ్గిన తర్వాత బంగారు రేణువుల కోసం స్థానికులు గాలింపు చేపడతారు. ఈ స్వర్ణ రేఖా నదిని స్థానికులు సోను నది అని అంటారు. ఈ నది పశ్చిమబెంగాల్, త్రిష రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. ఈ నదికి కర్కారి నది ఉపనదిగా ఉంది.

    బిగ్ హాల్ నది

    ఇది అమెరికాలో ఉంది. మోంటానా ప్రాంతంలో ప్రవహిస్తోంది. ఇక్కడ భారీ ఎత్తున బంగారం లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కోట్ల విలువైన బంగారాన్ని వెలికి తీసారట.

    యూబా నది

    అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదికి ఉపనదుల్లోనూ బంగారం రేణువులు లభిస్తాయట. ఈ ప్రాంతంలో అనేకచోట్ల తవ్వకాలు కూడా జరిగాయి.

    రైన్ నది

    యూరప్ లోని ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. జర్మనీ, స్విట్జర్లాండ్ ప్రజలు ఈ నది ఒడ్డున బంగారం కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటారు. కొన్నిచోట్ల భారీ ఎత్తున తవ్వకాలు కూడా జరిపారు.