https://oktelugu.com/

Horoscope Today: శుక్రాధిత్యం కారణంగా ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు..

Horoscope Today : కొన్ని పనుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2024 / 09:03 AM IST

    horoscope trigrahi

    Follow us on

    Horoscope Today: 2024 జూలై 1 సోమవారం రోజున ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు శుక్రాధిత్యం వల్ల కర్కాటకం, కన్య రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారంలో నైపుణ్యాలను ఉంచుకుంటారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రియమైన వారిని కలుసుకుంటారు.

    వృషభ రాశి:
    రాజకీయ రంగాల వారికి అనుకూలమైన వాతావరణం. జీవిత భాగస్వామి తో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. సాయంత్రం కొత్త వ్యక్తులను కలుస్తారు. అయితే వీరితో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి:
    విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. సాయంత్రం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కర్కాటక రాశి:
    భవిష్యత్తు కోసం కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. జీవనోపాధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉండొచ్చు.

    సింహారాశి:
    వ్యాపారులకు అనుకూల వాతావరణం. శత్రువుల నుంచి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి.

    కన్య రాశి:
    సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మధ్యాహ్నం సమయంలో చట్టపరమైన వివాదం లో విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

    తుల రాశి:
    కొన్ని శుభవార్తలు వింటారు. వాతావరణ ఆహ్లాదంగా ఉంటుంది. చేతిలోకి అనుకోని డబ్బు వస్తుంది. ఆర్థిక లావాదేవీల సమస్యలు తీరుతాయి.

    వృశ్చిక రాశి:
    ఆరోగ్య విషయంలో వైద్యుడి సలహా తీసుకోవాలి. కొన్ని సౌకర్యాలపై ఎక్కువ దృష్టి పెడతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ల సహకారం ఉంటుంది.

    ధనస్సు రాశి:
    ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు వస్తాయి‌ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం జరిగే అవకాశం.

    మకర రాశి:
    వివాదాలకు దూరంగా ఉండాలి. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఉపాధ్యాయుల ఆశీస్సులు ఉంటాయి.

    కుంభరాశి:
    అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరితో ఎక్కువగా వాదనలు చేయద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

    మీనరాశి:
    కొన్ని పనుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.