https://oktelugu.com/

Horoscope Today : ఈ రాశుల వారు ఈ రోజు ప్రయాణాలు చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..

Horoscope Today : చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. లేకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల కొన్ని పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2024 / 08:15 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు వలన కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఆదివారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈ కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకొని ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

    మేష రాశి:
    ఈ రాశి వ్యాపారాలు ఈరోజు బిజీగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని లాభదాయకమైన పనులు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ ఉంచాలి. కొన్ని పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇతరుల పనుల పై దృష్టి పెడతారు.

    వృషభ రాశి:
    జీవిత భాగస్వామితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చర్చలు పెడతారు. కొన్ని రంగాల వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా లేకుంటే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు.

    మిథున రాశి:
    ఈ రాశి వ్యాపారులు వాహనాలపై ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అనుకోని విధంగా మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం స్నేహితుల తో సరదాగా ఉంటారు. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఇదే సమయంలో దుబార ఖర్చులను నివారించాలి. ఆరోగ్యం పై ఆందోళన చెందుతారు.

    కర్కాటక రాశి:
    విదేశాల్లో ఉన్నవారి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆందోళనకు గురిచేస్తాయి. అందువల్ల ప్రసంగంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలి. తెలివితేటలతో వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు.

    సింహారాశి:
    చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. లేకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల కొన్ని పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. విదేశాల్లోని బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

    కన్య రాశి:
    వ్యాపారాలు కొత్త పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే అధిక లాభాలు పొందుతారు. శుభకార్యాల నిర్వహణ గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    తుల రాశి:
    ఈ రాశి వారు ఏ రోజు అనారోగ్యానికి గురై అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కొత్త వ్యక్తులతో స్నేహం చేసేవారు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

    వృశ్చిక రాశి:
    ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల వాగ్వాదాల విషయంలో మీరు మౌనంగా ఉండటమే మంచిది. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి ఆర్థికపరమైన శుభవార్తలు వింటారు. విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    ధనస్సు రాశి:
    అనవసర ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రభుత్వ పనుల కోసం బిజీ వాతావరణం లో గడుపుతారు. ఆరోగ్యం విషయంలో ఆందోళనతో ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. భాగస్వాములతో వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    మకర రాశి:
    భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ కోసం కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు.

    కుంభరాశి:
    ఈ రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా ఉంటారు. తమకు సంబంధించిన వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఇప్పటివరకు ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మ. సోదరుల మధ్య విభేదాలు ఉండే అవకాశం.

    మీనరాశి:
    ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. బంధువుల కోసం డబ్బును ఏర్పాటు చేస్తారు.