Bigg Boss Telugu 8: నిఖిల్ ని హీరో చేయడానికి అష్టకష్టాలు పడ్డ నాగార్జున..ఇక ఈయన హోస్టింగ్ కి రిటైర్మెంట్ ఇచ్చే సమయం వచ్చేసింది!

ముఖ్యంగా వాటర్ టాస్క్ లో యష్మీ, ప్రేరణ తో ప్రవర్తించిన తీరు చూసే ప్రతీ ఒక్కరికి చాలా అన్యాయంగా అనిపించింది. ఒక్క నాగార్జున కి తప్ప. అతను ఆడిన ఆట తీరుని కచ్చితంగా ఈ వీకెండ్ లో నాగార్జున నిలదీసి కడిగిపారేస్తాడు అని అందరూ అనుకున్నారు, కానీ చాలా సున్నితంగా, సుతిమెత్తగా డీల్ చేసి ఆడియన్స్ కి చిరాకు రప్పించాడు.

Written By: Vicky, Updated On : November 3, 2024 8:44 am

Bigg Boss Telugu 8(192)

Follow us on

Bigg Boss Telugu 8: అక్కినేని నాగార్జున అసలు హోస్టింగ్ అనేదే మర్చిపోయాడా..?, ఇక ఆ బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పే సమయం దగ్గరకి వచ్చేసిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకు కంటే గత కొన్ని వారాల నుండి ఆయన హోస్టింగ్ అంత చెత్తగా ఉంది కాబట్టి. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఆట తీరు ఎంత క్రూరంగా ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇన్ని రోజులు ఎంతో కూల్ గా గేమ్స్ ఆడుతూ వచ్చిన ఆయన, ఇప్పుడు ఒక్కసారిగా మాస్క్ మొత్తం పీకేసి గేమ్ ఆడినట్టు అందరికీ అనిపించింది. ముఖ్యంగా వాటర్ టాస్క్ లో యష్మీ, ప్రేరణ తో ప్రవర్తించిన తీరు చూసే ప్రతీ ఒక్కరికి చాలా అన్యాయంగా అనిపించింది. ఒక్క నాగార్జున కి తప్ప. అతను ఆడిన ఆట తీరుని కచ్చితంగా ఈ వీకెండ్ లో నాగార్జున నిలదీసి కడిగిపారేస్తాడు అని అందరూ అనుకున్నారు, కానీ చాలా సున్నితంగా, సుతిమెత్తగా డీల్ చేసి ఆడియన్స్ కి చిరాకు రప్పించాడు.

కేవలం యష్మీ , ప్రేరణ విషయంలో మాత్రమే కాదు, గౌతమ్ విషయంలో నిఖిల్ ప్రవర్తించిన తీరుపై అసలు స్పందించలేదు. గౌతమ్ కి యష్మీ ని ఎల్లో కార్డు ఇవ్వమని ప్రభావితం చేయడంతో పాటు, అతను తన యష్మీ టీం నుండి తప్పించిన తర్వాత నిఖిల్ రాక్షసంగా సంబరాలు చేసుకోవడం. వారం మొత్తం గౌతమ్ మీద అసూయతో ఆయన మాట్లాడిన మాటలు గురించి అసలు మాట్లాడకుండా ఉండడం, చివరికి గౌతమ్ ట్రిగర్ చేయడం వల్లే నిఖిల్ అలా చేసాడని, అసలు నిఖిల్ తప్పు ఏమి లేదని జనాలకి అర్థం అయ్యేలా చెప్పేందుకు నాగార్జున ఎంతో కష్టపడినట్టు ప్రేక్షకులకు అనిపించింది. ఇదంతా పక్కన పెడితే బ్యాగ్ టాస్క్ లో నిఖిల్ అద్భుతంగా ఆడాడట. ఇది మరో కామెడీ అని చెప్పొచ్చు. ఈ టాస్క్ లో ఆయన ఆడిన ఆట తీరు వాళ్ళ టేస్టీ తేజ తల పగిలిపోయే పరిస్థితి వచ్చింది.

తేజ చేతులను వెనుక నుండి గట్టిగా పట్టుకుంటే, ప్రేరణ అతని బ్యాగ్ లోని బాల్స్ ని క్రిందకి పడేస్తుంది. ఇది రూల్స్ కి పూర్తిగా విరుద్ధం, దీని గురించి నాగార్జున మాట్లాడకపోవడం గమనార్హం. అదే టాస్క్ లో ఆయన ప్రతీ ఒక్కరిని కాళ్లతో కొట్టే ప్రయత్నం చేసాడు. అతను గేమ్ ఆడే ఊపులో అవినాష్ ని బలంగా కడుపులో గుద్దాడు. అవినాష్ ఆ దెబ్బకు కుప్పకూలిపోయి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఆయన ఆ వారం లో కడుపు నొప్పి కారణం చేత బయటకి వెళ్లి డాక్టర్ ని కలిసి టెస్టింగ్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తిని అంత దారుణంగా గుద్దినప్పుడు అతనికి ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత..?, దీని గురించి నాగార్జున ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా?, అతను కావాలనే గుడ్డలేదు..ఆటలో పొరపాటుని గుద్దాడు, కానీ మనిషి లాగ ఆడు అని వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా?, ఎందుకు పట్టించుకోలేదు. ఈ సీజన్ ప్రారంభం లో పృథ్వీ ఇలా ఆడినప్పుడు రెడ్ కార్డు వార్నింగ్స్ ఇచ్చాడు. సీజన్ 6 లో రేవంత్ కి కూడా ఇలాంటి వర్కింగ్స్ ఇచ్చాడు నాగార్జున, కానీ నిఖిల్ విషయంలో మాత్రం ఇంత వివక్ష ఎందుకు అనేదే ఆడియన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న.