https://oktelugu.com/

Chanakya Niti: చాణక్య నీతి: బుద్ధిమంతులు వీటిని ఎందుకు రహస్యంగా ఉంచుతారు?

అపర చాణక్యుడు జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సూత్రాలను ప్రజలకు చెప్పాడు. ఇవి పాటించిన వారు జీవితంలో అనుకున్న విజయాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా బుద్ధిమంతులు తమ అలవాట్ల వల్ల వారు మాత్రమే కాకుండా తమ తోటి వారి జీవితాన్ని బాగుపరుస్తున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 3, 2024 / 07:45 AM IST

    chanakya-niti

    Follow us on

    Chanakya Niti: ప్రతి ఒక్కరూ తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. అధిక ధనం సంపాదించాలనుకుంటారు. ఇతరులకన్నా ఎక్కువగా మేధాసంపత్తి ఉండాలని కోరుకుంటారు. కానీ బుద్ధిమంతుడిగా ఉండాలి అంటే మాత్రం వినరు. కొందరు బుద్ధిమంతులు ప్రత్యేకంగా కొన్ని రహస్యాలను ఇతరులకు చెప్పరు. దీంతో వారు అనుకున్న పనిని అనుకున్నట్లు విజయం పొందుతారు. అంతేకాకుండా వారు చేసే పనుల్లోనూ ప్రత్యేకత ఉంటుందని చాణక్య నీతి చెబుతుంది. వారు చేసే పనులు పట్టించుకోకుండా వారు విజయం సాధించిన తరువాత ఇతరులు చూసి ఈర్ష్య పడుతారు. అయితే బుద్ధిమంతులు ఎక్కువగా ఏ విషయాలను రహస్యగా ఉంచుతారు. అవి ఇతరులకు చెప్పడం వల్ల ఏం జరుగుతుంది?

    అపర చాణక్యుడు జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సూత్రాలను ప్రజలకు చెప్పాడు. ఇవి పాటించిన వారు జీవితంలో అనుకున్న విజయాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా బుద్ధిమంతులు తమ అలవాట్ల వల్ల వారు మాత్రమే కాకుండా తమ తోటి వారి జీవితాన్ని బాగుపరుస్తున్నారు. అయితే బుద్ధిమంతుల పాటించే నియమాలు కొందరు మూర్ఖులు పాటించలేరు. వారికి ఉన్న ఓపిక, ఆలోచించే గుణం, దయాగుణం ఇతరులకు ఉండదు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో పటిష్టంగా ఉంటూ తమ జీవితాలను చక్కబెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ విషయాలను అస్సలు బయటకు చెప్పరు.

    చాల మంది దాంపత్య జీవితాన్ని బయటపెడుతూ ఉంటారు. పడక గది విషయాలను కూడా స్నేహితులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ బుద్ధిమంతులు మాత్రం ఈ విషయాలను అస్సలు ఇతరులతో షేర్ చేసుకోరు. పడకగది విషయాలను ఇతరులకు చెప్పడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతారు. ఈ విషయాన్ని ఎప్పటికైనా రహస్యంగా ఉంచుకోవాలి. ఇవి బయటకు చెప్పడం వల్ల ఎదుటి వారి ముందు చులకనగా మారుతారు.

    జీవితంంతో దాన, ధర్మాలు ముఖ్యమే. కొందరు సంపద ఉండి.. అందులోనుంచి కొంత దానం చేస్తారు. కానీ తమ కు ఉన్నదాంట్లో ఇతరులకు ఇవ్వాలనే గుణం బుద్ధిమంతులది. అయితే ఇలా ఇచ్చే దానం గురించి బుద్ధిమంతులు అస్సలు బయట చెప్పరు. ఇలా చెప్పడం వల్ల వారి స్థాయి ఇతరులకు తెలిసిపోతుంది. దీంతో వారు ఎలాంటి దానాలు చేస్తారో? ఎంత వరకు దానం చేస్తారో? ఇతరులకు తెలిసిపోతుంది. కానీ ధర్మం ప్రకారం ఇతరులకు దానం విషయం చెప్పడం కరెక్ట్ కాదు.

    ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. అయితే దగ్గరి బంధువులకు తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుంటారు. కానీ ఇంట్లో ఉన్న లోటుపాట్ల గురించి కొందరు బయట చెబుతూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల వారి స్థాయి ఏంటనేది ఇతరులకు తెలిసిపోతుంది. దీంతో కొందరు అశుభం కోరుకునేవారి నుంచి వారి స్థాయి ప్రకారం మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల బుద్ధిమంతులు ఈ విషయాలను ఎవరికీ చెప్పరు.

    కొందరు కొన్ని వస్తువుల విషయంలో పొరపాటు పడుతుంటారు. అనుకోకుండా ఈ ఆహారాన్ని తినడం వల్ల నష్టపోతారు. కానీ చెడు ఆహారం విషయంలో జాగ్రత్తగా వహించాలని చెప్పాలి. కానీ ఈ ఆహారాన్ని తినాలని ఇతరులను ప్రోత్సహించడం ద్వారా ముర్ఖత్వమే అవుతుంది. బుద్ధిమంతులు మాత్రం తమకు నష్టం జరిగే ఏ విషయం అయినా ఇతరులకు చెప్పుకుండా ఉంటారు. దీంతో ఎదుటివారు నష్టపోకుండా జాగ్రత్త పడుతారు.