https://oktelugu.com/

Astrology: ఇక నుంచి ఈ రాశుల వారు అదృష్టవంతులు… విజయం వీరి వెంటే..

సూర్యుడు కొత్త రాశిలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల తులా రాశి వారికి అనుకోని అదృష్టం వరించనుంది. వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 16, 2025 / 04:00 AM IST

    Astrology

    Follow us on

    Astrology: మకర సంక్రాంతి పండుగను అందరూ ఘనంగా నిర్వహించుకున్నారు. అందమైన ముగ్గులతో వాకిళ్లు నిండిపోయాయి. పిండి వంటలతో ఘుమఘుమలు వచ్చాయి. బంధుమిత్రులతో ప్రజలు సంతోషంగా గడిపారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజు పుష్య నక్షత్రం ఉంటుంది. ఈరోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు పుష్య నక్షత్రం గుండా ప్రవేశించి కొన్ని రోజుల పాటు మకర రాశిలో ఉండనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉండనున్నాయి. వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మరి ఆ అదృష్ట వంతుల రాశులు ఏవో చూద్దాం..

    మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశం వల్ల కర్కాటక రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇవే మంచి రోజులు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలన్నా.. అనుకూల సమయం. అయితే వ్యాపారులు కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త పెట్టుబడులు ప్రారంభిచే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. కొందరు ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఇదే మంచిసమయం.

    సూర్యుడు కొత్త రాశిలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల తులా రాశి వారికి అనుకోని అదృష్టం వరించనుంది. వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు అధికంగా లాభాలు ఉంటాయి. ప్రణాళి ప్రకారం పనులు చేయడం వల్ల విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి కోసం బహుమతులు కొంటారు. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొత్త పెట్టుబడులను పెడుతారు. కొందరు శత్రువులు ఎంత ప్రయత్నించినా ఈ రాశి వారి మీద విజయం సాధించలేరు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లడంతో సంతోషంగా ఉంటారు.

    మకర సంక్రాంతి నుంచి మీన రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కార్యాలయాల్లో సీనియర్ల మద్దతు ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరితో అధిక లాభాలు ఉండే అవకాశం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఊహించని విధంగా అదృష్టం వస్తుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొన్ని రంగాల వారు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసినట్లయితే ధనలాభం ఎక్కువగా ఉంటుంది. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మాటల నియంత్రణ వల్ల శుభయోగం కలుగుతుంది.