Health benefits of garba dance: గర్బా డ్యాన్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?
ర్బా డ్యాన్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. గుండె ప్రమాద సమస్యలు రాకుండా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. అలాగే కాళ్లు, చేతులు, కండరాలు బలంగా తయారవుతాయి. గర్బా స్టెప్‌ల వల్ల హృదయ స్పందన రేటును కూడా పెంచుకోవచ్చు. డ్యాన్స్ చేసేటప్పుడు చేతులు, భుజాలు కదలడం వల్ల కండరాలకు బలం చేకూరుతుంది.
Health benefits of garba dance: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రులు అనగా అందరికి గుర్తువచ్చేది గర్బా డ్యాన్స్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఈ గర్బా డ్యాన్స్ ఆడటానికి ఇష్టపడతారు. సాధారణంగా డ్యాన్స్ చేయడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. శరీరానికి మంచి వ్యాయామంలా డ్యాన్స్ బాగా ఉపయోగపడుతుంది. అయితే నవరాత్రుల్లో ముఖ్యంగా తొమ్మిది రోజుల పాటు చేసే గర్బా డ్యాన్స్ ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలను చేకూరుస్తుంది. గర్బా డ్యాన్స్ చేయడం వల్ల శరీర కండరాలు బలంగా తయారవుతాయి. ఈ గర్బా డ్యాన్స్ అనేది ఏరోబిక్ వ్యాయామం చేసినంత ప్రయోజనాలను ఇస్తుంది. తొమ్మిది రోజుల పాటు గర్బా డ్యాన్స్ చేయడం వల్ల కేలరీలు తగ్గుతాయి. రోజుకి 30 నిమిషాల పాటు డ్యాన్స్ చేయడం వల్ల సుమారుగా 200 నుంచి 250 కేలరీలను బర్న్ చేయవచ్చు. ఈ తొమ్మిది రోజుల్లో దాదాపుగా 4 నుంచి 5 కేజీలు తగ్గవచ్చు. ఫిట్‌నెస్ పాటించే వారికి గర్బా డ్యాన్స్ మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది.
శారీరక సమస్యలే కాకుండా..
గర్బా డ్యాన్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. గుండె ప్రమాద సమస్యలు రాకుండా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. అలాగే కాళ్లు, చేతులు, కండరాలు బలంగా తయారవుతాయి. గర్బా స్టెప్‌ల వల్ల హృదయ స్పందన రేటును కూడా పెంచుకోవచ్చు. డ్యాన్స్ చేసేటప్పుడు చేతులు, భుజాలు కదలడం వల్ల కండరాలకు బలం చేకూరుతుంది. కాస్త సమయం చేసిన ఫలితం ఎక్కువగా ఉంటుంది. కేవలం ఈ సమస్యలే కాకుండా ఊపిరితిత్తుల సమస్యలను కూడా తగ్గించడంలో గర్బా డ్యాన్స్ బాగా ఉపయోగపడుతుంది. ఈ గర్బా డ్యాన్స్ వల్ల కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. చాలామంది మానసికంగా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు గర్బా డ్యాన్స్‌తో కాస్త విముక్తి చెందవచ్చు. గర్బా డ్యాన్స్ చేయడం వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ఎండార్ఫిన్స్ హార్మోన్.. ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే కొందరు బాధపడుతూ ఒంటరితనానికి లోనవుతుంటారు. ఇలాంటి వారు గర్బా డ్యాన్స్ చేయడం వల్ల ఒంటరితనం నుంచి విముక్తి చెందుతారు. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు.
డ్యాన్స్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గర్బా డ్యాన్స్ చేసే ముందు ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా రోజుల నుంచి డ్యాన్స్ చేయకపోవడం వల్ల కండరాలు తిమ్మిరి ఎక్కుతాయి. కాబట్టి ముందుగా కాస్త తక్కువగా చేయండి. దీనివల్ల కండరాలు కాస్త అలవాటు పడతాయి. డ్యాన్స్ చేసే ముందు చేసిన తర్వాత నీరు ఎక్కువగా తాగండి. దీనివల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. డ్యాన్స్ చేసేటప్పుడు సరైన చెప్పులు ధరించండి. ఎక్కువగా షూలు ధరిస్తారు. వీటిని ధరించి డ్యాన్స్ చేయడం వల్ల కంఫర్ట్‌గా ఉండి, ఎక్కువ సమయం డ్యాన్స్ చేయగలరని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేగంగా చేయవద్దు. ఒక్కసారి ఇలా చేయడం వల్ల శరీరానికి గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నెమ్మదిగా చేస్తుండండి. డ్యాన్స్ చేసేటప్పుడు ఎనర్జీ కావాలి. కాబట్టి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడంతో పాటు శరీరానికి బలాన్నిచ్చే పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.