Thar: ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో చాలా మంది తమకు ఇష్టమైన కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో ఈ సీజన్ క్యాష్ చేసుకోవాలని ఆటోమొబైల్ కంపెనీలు చూస్తున్నాయి. అందుకే పండుగ సీజన్లో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. దేశంలోని ఆఫ్-రోడింగ్ లేదా లైఫ్ స్టైల్ సెగ్మెంట్ విషయానికి వస్తే.. మహీంద్రా థార్ లైన్‌లో ముందంజలో ఉంది. దాని వెనుక మరే కారు కనిపించదు. ఇప్పుడు కంపెనీ ఈ నెలలో తన పాపులర్ ఎస్ యూవీ పై దసరా, దీపావళి ఆఫర్లను తీసుకువచ్చింది. థార్ 4×4పై కంపెనీ రూ. 1.50 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కారుపై రూ.1.25 లక్షల నగదు తగ్గింపుతోపాటు రూ.25 వేల విలువైన యాక్ససరీస్‌ను అందిస్తుంది. థార్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షల వరకు ఉన్నాయి. థార్ 2డబ్ల్యూడీ మరియు 4డబ్ల్యూడీ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. థార్ రాక్స్‌పై కంపెనీ ఎలాంటి తగ్గింపును ఇవ్వడం లేదన్న విషయాన్ని కస్టమర్లు గమనించాలి.
మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ మధ్య తేడా
డిజైన్ గురించి చెప్పాలంటే.. బయటి నుండి చూసినప్పుడు తేడా చెప్పడం కొంచెం కష్టం. అంటే, రెండు మోడల్‌లను మీ ముందు ఉంచినప్పటికీ వాటిని సులభంగా గుర్తించలేరు. అయితే, రెండు మోడళ్లలో 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ విభిన్న బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. రెండింటి ముందు, వెనుక వైపు చూస్తే ఒకే విధంగా ఉంటాయి. అయితే, బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ కలర్ ఆప్షన్‌లు 2డబ్ల్యూడీలో అందుబాటులో ఉంటాయి. రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమిటంటే 2డబ్ల్యూడీలో వెనుక చక్రం మాత్రమే శక్తిని పొందుతుంది. అయితే 4డబ్ల్యూడీలో అన్ని చక్రాలు శక్తిని పొందుతాయి.
మీరు మహీంద్రా థార్ 2డబ్ల్యూడీని 1.5-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ అనే రెండు ఇంజన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. మరోవైపు, 2.0-లీటర్ పెట్రోల్ 152 బిహెచ్‌పి పవర్, 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ ఇంజన్ థార్ 4డబ్ల్యూడీలో కూడా ఉపయోగించారు. 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ సెకండ్ ఆప్షన్ గా అందుబాటులో ఉంది.
థార్ 2డబ్ల్యూడీ ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు చేశారు. దానికి క్యూబి హోల్ ఉంటుంది. థార్ 2డబ్ల్యూడీ ఆటో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ ఇచ్చారు. దీనిని స్టీరింగ్ వీల్, డ్రైవర్ డోర్ మధ్య కంట్రోల్ ప్యానెల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, డోర్ లాక్/అన్‌లాక్ వంటి బటన్‌లు కూడా థార్‌లో అందుబాటులో ఉన్నాయి.
అయితే, వాటి స్థానం సెంటర్ కన్సోల్‌కు మార్చారు. ఇది కాకుండా, రెండు మోడల్‌లు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో ఒకే 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతాయి. ఇది ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, క్రూయిజ్ కంట్రోల్, ఎల్ ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLలు) కూడా కలిగి ఉంది.