Hindu Temples : భారత దేశం హిందూ దేశం. ఇందుకు అనేక చారిత్రక ఆధారాలూ ఉన్నాయి. శ్రీరాముడు నడయాడిన నేలగా గొప్పగా చెప్పుకుంటాం. కానీ, అనేక దేశాల దండగయాత్రల తర్వాత భారత దేశంలోకి అనేక మతాలవారు వచ్చారు. వారి ఒత్తిడి కారణంగా అనేక మంది మతం మార్చుకున్నారు. ముస్లిం, హిందు మతాలు ఇలా మన దేశంలోకి వచ్చినవే. అయితే ప్రజాస్వామ్యంలో అన్ని మతాలు సమానంగా గౌరవించాలి.. అందరం కలిసి ఉండాలి అన్న వాదనను తెరపైకి తెచ్చారు. రాజ్యాంగం కూడా మనది లౌకికవాదం దేశం అని చెబుతోంది. కానీ, పాలకులు అధికంగా ఉండే హిందువలపైనే వివక్ష చూపడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఆలయాలపై పాలకుల పెత్తనంపై మరోమారు చర్చ జరుగుతోంది. లౌకిక దేశంలో మసీదులు, చర్చిలతోపాటు అనేక మతాల ప్రార్థన మందిరాలు ఉన్నాయి. కానీ, పాలకులు మాత్రం హిందూ ఆలయాలపై మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నారు.
సంపద కోసమే..
భారత దేశంలో హిందూ ఆలయాలకు భారీగా భూములు ఉన్నాయి. లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. దీంతో పాలకుల ఆలయాలకు నిధులు ఇవ్వకపోగా ఉన్న నిధులపై పెత్తనం కోసం పదవులను అడ్డం పెట్టుకుంటున్నారు. తిరుపతి ఆలయం లెక్కల ప్రకారం టీటీడీకి వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఇక ఆస్తులు రూ.2 లక్షల కోట్లకుపైగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పాలకులు తిరుమల ఆదాయం కోసం పదవులను వాడుకుంటున్నారు. టీటీడీ బోర్డు పూర్తిగా రాజకీయ నాయకుల అడ్డాగా మారింది. టీటీడీకి ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఏ ప్రైవేటు కంపెనీకి కూడా ఇంత ఆదాయం రాదు. దీంతో టీటీడీ సంపదను కొల్లగొట్టేందుకు రాజకీయ నేతలు టీటీడీ బోర్డులో ఆశ్రయం పొందుతున్నారు. నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం లేకపోవడంతో టీటీడీ ద్వారా కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. తిరుమలలోని తమకు అనువైన చోట షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించుకుంటున్నారు. టెండర్లు దక్కించుకుని పనులు చేస్తున్నారు. ఇలా టీటీడీ బోర్డు నేతలకు ఉపాధి కేంద్రంగా కూడా మారుతోంది.
మైనారిటీ ప్రార్థన మందిరాలపై వారిదే అధికారం..
లౌకి దేశమైన ఇండియాలో మైనారిటీ మతసంస్థల ప్రార్థనా స్థలాల నిర్వహణ అధికారం పూర్తిగా మైనారిటీలదే ప్రభుత్వాలు వేలు కూడా పెట్టవు. హిందూ ఆలయాలకు నిధులు ఇవ్వని పాలకులు. మైనారిటీలు నిర్వహించే మదరసాలు, చర్చిలు, హజ్ యాత్రీకులకు మాత్రం నిధులు ఇస్తున్నారు. దీనిని లౌకిక వాదులెవరూ ప్రశ్నించడం లేదు. ఏ దేశంలోనైనా మెజారిటీ ప్రజలు ఉన్న సంస్థలకు ప్రాధాన్యం దక్కుతుంది. భారత్‌లో మాత్రం పాలకులు మైనారిటీలకు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ప్రచారం చేస్తున్నారు లౌకికవాదులు. లౌకికవాదం ముసుగులో హిందువులపై తీవ్ర వివక్ష చూపుతున్నారు.
విరాళాలపై టాక్స్..
ఇక మన దేశంలో ప్రభుత్వాలు హిందూ ఆలయాలకు ఎలాంటి నిధులు ఇవ్వకపోగా, భక్తులు ఇచ్చే విరాళాలపై పన్నులు వసూలు చేస్తున్నాయి. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. మైనారిటీ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, ఇతర సంస్థలపైనా ప్రభుత్వ పెత్తనం పరిమితంగా ఉంది. హిందూ దేవాలయాలు నిర్వహించే సంస్థలు మాత్రం చట్ట పరిధిలో ఉంటాయి. ఇక లౌకిక వాదులు ప్రభుత్వ జోక్యాన్ని సమర్థిస్తూ.. చట్ట ప్రకారం వచ్చినదాన్ని వ్యతిరేకించొద్దని పేర్కొంటున్నారు. అదే చట్టం అన్ని మతాలకు ఎందుకు వర్తించలేదో మాత్రం సమాధానం చెప్పడం లేదు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Governments are making demands on hindu temples for the property of hindu temples
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com