Astrology: జీవితంలో జ్యోతిష్య శాస్త్రం కూడా ప్రధానమని కొందరు పండితులు చెబుతారు. గ్రహాల మార్పు కారణంగా ఒక మనిషిపై ప్రభావం ఎంతో ఉంటుందని అంటుంటారు. ప్రతినెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రశేశిస్తాడు. దీంతో కొన్ని గ్రహాలపై ప్రభావం ఉంటుంది. ఇది మనుషుల జీవితాల్లో మార్పులు తెస్తుంది. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో మూడు రాశుల వారి జీవితంలో చిక్కులు చికాకులు ఏర్పడుతాయి. పండితులు చెబుతున్నా ఆ విషయాలేవి అంటే?
కన్యారాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకాం కన్యారాశి కలిగిన వారికి ఈ నెల రోజులు అంత మంచిది కాదని అంటున్నారు. వీరి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కూడా నష్టాలు ఎదురవుతాయి. మానసికంగా కుంగిపోతారు. వ్యక్తిగత వివాదాలకు దూరంగా ఉండాలి. అయితే పండితులను కలిసి పరిహారం కోసం ప్రయత్నించాలి.
కుంభారాశి: కుంబా రాశి వారు కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఇతర వివాదాల్లోనూ చిక్కుకుంటారు. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ఓపికతో ఉండాలి. ఈ రాశివారిపై సూర్యుడి ప్రభావం మంచిది కాదు. అయితే పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేయొచ్చు.
మకరరాశి: మకర రాశివారిపై సూర్యుడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీరు ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు. వైవాహిక సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో వివాదాలకు పోవద్దు. ఉద్యోగులు కార్యాలయాల్లో సంయమనం పాటించాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. పరిహారం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు.