Rent House: సొంతింట్లో ఉంట్లే ఉండే సరిగ్గా భోజనం చేయకున్నా పర్వాలేదు అని కొందరు అనుకుంటారు. అందువల్ల చాలా కష్టపడిసొంతంగా ఇల్లు కట్టుకుంటారు. కుదరకపోతే రెడిమేడ్ గా ఇల్లు కొనుగోలు చేస్తారు. అయితే కొందరు సొంతిల్లు కంటే అద్దె ఇల్లు చాలా బెటర్ అని అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే సొంత ఇల్లు కొనుగోలు చేసిన దాని ఈఎంఐ చెల్లించేబదులు అద్దెకు తక్కువ చెల్లించవచ్చు అని అంటారు. అద్దె కు ఉండాలంటే ఎక్కడైనా ఉండొచ్చు. లోకేషన్ నచ్చకపోతే మారవచ్చు. అని అంటున్నారు. కానీ సొంత ఇల్లు ఉండడం ద్వారా ఎంతో డబ్బు ఆదా అవుతుందని అని మరికొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో అసలు అద్దె ఇంట్లో ఉంటే బెటరా? లేదా సొంత ఇల్లు కట్టుకోవడం మంచిదా? అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం..
అద్దె ఇంట్లో లాభాలు:
అద్దె ఇంట్లో ఉండడం వల్ల ఎక్కడికైనా షిప్ట్ కావొచ్చు. ఇతర పన్నులు కట్టాల్సిన అవసరం ఉండదు. కొంచెం సిటికీ దూరంగా అద్దెకు తీసుకుంటే తక్కువ రెంట్ ఉంటుంది. అంతేకాకుండా కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. సత్సంబంధాలు పెరిగిపోతాయి. ఇల్లుకు ఎలాంటి ప్రమాదం ఏర్పడినా మరో ఇంట్లోకి వెంటనే షిప్ట్ కావొచ్చు. పిల్లల స్కూల్ కోసం లేదా జాబ్ కోసం అవసరమైతే అక్కడికే షిప్ట్ కావొచ్చు. దీని ద్వారా ప్రయాణ ఖర్చులు ఆదా చేసుకోవచ్చు.
అద్దె ఇంట్లో ఉంటే నష్టాలు:
అద్దె ఇంట్లో ఉండడం వల్ల కొందరు నరకం అనుభవిస్తున్నామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా ఇంటి యజమాని చెప్పిన విధంగా నడుచుకోవాలి. ప్రైవసీ తక్కువగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో అద్దె పర్సెంటేజీల చొప్పున అద్దె పెంచుతూ ఉంటారు. దీంతో జీతం కంటే అద్దె చెల్లించడమే గగనమవుతుంది. జాబ్ లేకపోయినా.. వ్యాపారంలో నష్టాలు వచ్చినా అద్దె తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీసారి రూమ్ షిప్ట్ కావడం ఇబ్బందిగా ఉంటుంది.
సొంత ఇల్లు వల్ల లాభాలు:
సొంత ఇంట్లో ఏం చేసినా ఎవరూ అడగరు. సొంత ఇల్లు ఎప్పటికైనా మనదే అవుతుంది. జాబ్ లేకున్నా.. వ్యాపారంలో నష్టం వచ్చినా..అద్దె చెల్లించాలన్న బాధ ఉండదు. ప్రత్యేక సందర్భాల్లో సొంత ఇల్లు ఎంతో మేలు. కరోనా సమయంలో చాలా మంది యజమానులు బాధితులను ఇంట్లోకి రానివ్వలేదు. సొంత ఇంట్లో అలాంటి పరిస్థితి ఉండదు.
సొంత ఇల్లు వల్ల నష్టాలు:
ఆర్థికంగా డబ్బలు ఉంటే సొంత ఇల్లు చాలా బెటర్ . కానీ అప్పులు చేసి ఇల్లు కొనుక్కోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీటికి వడ్డీలు కట్టే బదులు అద్దె ఇంట్లో ఉండడమే మేలు అని కొందరి అభిప్రాయం. ఇల్లుకు చేసిన అప్పు తీరదు అని కొందరు అంటుంటారు.దీనికి బదులు తక్కువ అద్దె కడుతూ ప్రశాంతంగా ఉండొచ్చని అంటుంటారు.
ఫైనల్ గా సొంత ఇల్లే చాలా బెటర్. కానీ ఆర్థిక ప్రణాళికలు వేసుకొని ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయాలి. అద్దె ఇల్లు ఎప్పటికైనా మన సొంతం కాదు. కానీ సొంత ఇల్లు మనం అనుభవించకపోయినా తరువాతి తరం వారు హాయిగా ఉంటారు.