Digital Payments: ఫైనాన్స్ సెక్టార్ లోకి టెక్నాలజీ ఎంట్రీ ఇవ్వడంతో ప్రతీది డిజిటలైజేషన్ అయింది. దీంతో ఆర్థిక వ్యవహారాలన్నీ మైబైల్ ద్వారా నడుస్తున్నాయి. కిరాణం షాపుల్లో రూ.100 లోపు కొనుగోలు చేసినా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లిస్తున్నారు. ఇలా చెల్లించే వారు UPIని మార్గ మధ్యంగా ఎంచుకుంటున్నారు.క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసిన వారికి UPI నెంబర్ వస్తుంది. ఫోన్ నెంబర్ ద్వారా కాకుండా దీని ద్వారా కూడా మనీని ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. అయితే తాజాగా యూపీఐ చెల్లింపు దారులకు నేషనల్ పేమేంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే?
మొబైల్ ద్వారా మనీని ట్రాన్స్ ఫర్ చేయాలనుకునేవారు ఓ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ ద్వారా చాలా మంది ఫోన్ పే, గూగుల్ పే, పేటీ ఎం, వంటి యాప్ లను ఉపయోగించి నగదును ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు. ఇందుకోసం ఫోన్ నెంబర్ అవసరం ఉంటుంది. అయితే చాలా మంది బ్యాంకుకు లింకైన నెంబర్ ను సెట్ చేసుకుంటారు. అయితే ఒక్కోసారి ఇలా సెట్ చేసుకున్న నంబర్ ను వాడరు. కాల క్రమంలో దానిని పట్టించుకోరు.
కానీ ఆ నెంబర్ ద్వారానే డిజిటల్ పేమేంట్స్ జరుగుతూ ఉంటాయి. ఫోన్ నెంబర్ మనుగడ లేకున్నా కొన్ని యాప్ లు నగదు ట్రాన్స్ ఫర్ కు అవకాశం ఇస్తున్నాయి. కానీ తాజాగా అలాంటి అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే మనుగడలోని లేని నంబర్లు బ్యాంకుకు లింకై ఉంటే వాడని డియాక్టివేట్ చేయాలని సర్క్యులర్ జారీ అయింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఒక ఫోన్ నెంబర్ చట్టబద్ధమైన 90 రోజుల్లో వాడకపోతే కొత్త సబ్ స్క్రైబర్లు ఆ నెంబర్ ఇవ్వకూడదని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించలేమని తెలిపింది. దీంతో వినియోగదారులు అలా పాత రోజుల్లో వాడిన నెంబర్లు వేరొకరికి వెళ్లే అవకాశం ఉంది.
ఈ తరుణంలో బ్యాంకులకు ఆ నెంబర్ లింకై ఉంటే ప్రమాదంలో పడుతారు. ఓటీపీ తదితర బ్యాంకు వ్యవహారాలు ఆ నెంబర్ కు మెసేజ్ వెళ్తుంటాయి. దీనిని కొత్తగా దక్కించుకున్న వారికే ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మనుగడలో లేని నెంబర్లు సాధ్యమైనంత వరకు త్వరగా డియాక్టివేట్ చేయాలని నేషనల్ పేమేంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అలా చేస్తే వినియోగదారులు భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని అంటున్నారు.