Horoscope Today: గ్రహాల మార్పు ప్రభావం కొన్ని రాశులపై ఉంటుంది. ఈ రాశులు కలిగిన వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వబాద్ర నక్షత్రం ఉంటుంది. అలాగే ఇదే రోజు వృద్ధి యోగం ఏర్పడనుంది. దీంతో మేష రాశి ఉద్యోగులకు ప్రశంసలు ఉంటాయి. తుల రాశి వారు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారి ఇంటికి ఈరోజు అతిథి వస్తాడు. దీంతో ఇల్లు సందడిగా మారుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను చేరడంతో ప్రశంసలు అందుతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.
వృషభ రాశి:
కొత్త వ్యక్తులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. గృహ అవసరాల కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు.
మిథున రాశి:
అనుకోకుండా విహార యాత్రలకు వెళ్తారు. కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారంపై ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి:
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం. కొత్త పెట్టుబడులపై చర్చిస్తారు. ఉద్యోగులు అనుకున్న బాధ్యతలను నెరవేరుస్తారు.
సింహారాశి:
సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా ఉంటారు.
కన్య రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
తుల రాశి:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు ఇతర సలహాలు తీసుకోవడం మంచిది. కొన్ని ఖర్చులు పెరుగుతాయి.
ధనస్సు రాశి:
ఉద్యోగులకు సంపద పెరుగుతుంది. రాత్రి సమయంలో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంతో కొన్ని విభేదాలు రావొచ్చు.
మకర రాశి:
ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. విహార యాత్రలకు వెళ్లాల్సి వస్తే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మానసికంగా ఒత్తిడితో ఉంటారు. హానికరమైన పనులకు దూరంగా ఉండడమే మంచిది.
కుంభరాశి:
కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సాయంత్రి శుభవార్తలు వింటారు.
మీనరాశి:
కొత్త ఉద్యోగంలో చేరుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆదాయం పెరగడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు.