https://oktelugu.com/

Bigg Boss kannada 11 : బిగ్ బ్రేకింగ్ : బిగ్ బాస్ షో కి పోలీసుల నోటీసులు..ఆ కాన్సెప్ట్ ని తక్షణమే నిలిపేయాలంటూ ఆదేశాలు!

కిచ్చ సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ కోసం 'స్వర్గం..నరకం' అనే కాన్సెప్ట్ ని తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం నరకం లో ఉండే కంటెస్టెంట్స్ ఆహారంగా కేవలం గంజి మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ మీద అన్ని అధికారాలు స్వర్గం లో కంటెస్టెంట్స్ దగ్గరే ఉంటుంది. చివరికి బాత్రూం కి వెళ్ళాలి అన్నా స్వర్గం లో ఉన్న కంటెస్టెంట్స్ అనుమతి తీసుకోవాల్సిందే. దీనిపై కర్ణాటక మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 08:47 AM IST

    Bigg Boss kannada 11

    Follow us on

    Bigg Boss kannada 11 :  ప్రేక్షకులను కొత్తగా ఆకట్టుకోవడం కోసం బిగ్ బాస్ టీం ప్రతీ ఏడాది సరికొత్త కాన్సెప్ట్స్ తో మన ముందుకొస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మన తెలుగు సీజన్ 6 వరకు ఒకే రకమైన కాన్సెప్ట్స్ తో నడిచింది. సీజన్ 6 ఫ్లాప్ అవ్వడం తో సీజన్ 7 నుండి కొత్త కాన్సెప్ట్స్ ని పరిచయం చేసారు. సీజన్ 7 లో ఉల్టా పల్టా కాన్సెప్ట్ ని ప్రయోగించారు, అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది, ఆడియన్స్ గత సీజన్ ని ఎగబడి చూసారు. ప్రస్తుత సీజన్ ‘అన్ లిమిటెడ్’ అనే కాన్సెప్ట్ తో మొదలైంది. ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ అంతంత మాత్రం గానే కొనసాగుతున్నప్పటికీ మధ్యలో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు కారణంగా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తోనే ముందుకు దూసుకుపోతుంది. మన దగ్గర కాన్సెప్ట్స్ కఠినతరం గా లేవు, కంటెస్టెంట్స్ కి కేవలం ఫుడ్ విషయం లో సమస్య ఉన్నింది కానీ, నిన్నటితో ఆ సమస్య కూడా తీరిపోయింది. కానీ రీసెంట్ గానే కన్నడ లో బిగ్ బాస్ సీజన్ 11 మొదలైంది.

    కిచ్చ సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ కోసం ‘స్వర్గం..నరకం’ అనే కాన్సెప్ట్ ని తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం నరకం లో ఉండే కంటెస్టెంట్స్ ఆహారంగా కేవలం గంజి మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ మీద అన్ని అధికారాలు స్వర్గం లో కంటెస్టెంట్స్ దగ్గరే ఉంటుంది. చివరికి బాత్రూం కి వెళ్ళాలి అన్నా స్వర్గం లో ఉన్న కంటెస్టెంట్స్ అనుమతి తీసుకోవాల్సిందే. దీనిపై కర్ణాటక మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. బిగ్ బాస్ షో లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ కారణంగా మహిళలకు ఉన్న ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతుందని, కర్ణాటక రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ నాగ లక్ష్మి పోలీసులకు లేఖ రాశారు. దీనిని విచారించిన పోలీసులు బిగ్ బాస్ యాజమాన్యం కి నోటీసులు జారీ చేసారు. ఎంటర్టైన్మెంట్ కోసం డిజైన్ చేసే కాన్సెప్టులు ఒక పరిధి వరకు బాగానే ఉంటుంది. ఆ పరిధిని దాటితే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.

    కన్నడ బిగ్ బాస్ లో పరిచయం చేసిన ఈ స్వర్గం – నరకం అనే కాన్సెప్ట్ కచ్చితంగా ఒక మనిషిని హింస పెట్టేది అని చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ ని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళం భాషలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల కచ్చితంగా టీఆర్ఫీ రేటింగ్స్ రావొచ్చు, కానీ ఈ సీజన్ లోనే ఇలా ఉందంటే, తదుపరి సీజన్ లో రక్తాలు చిందించే కాన్సెప్ట్స్ కూడా డిజైన్ చేయొచ్చు. మరి పోలీసులు ఈ కాన్సెప్ట్ ని నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో పై కఠిన చర్యలు తీసుకుంటుందా?, దీనికి బిగ్ బాస్ టీం ఎలాంటి వివరణ ఇవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది.