DC Vs RR IPL 2025: ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్ల పరుగులు సమం అయినప్పుడు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. సూపర్ ఓవర్లో చేజింగ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు విధించిన స్కోరును.. ప్రత్యర్థి జట్టు చేదిస్తే విజయం సాధ్యమవుతుంది. లేకుంటే చేజింగ్ జట్టు విజేతగా నిలుస్తుంది.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే సూపర్ ఓవర్ నిబంధనలు విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా క్రికెట్లో 11మంది ఆడతారు. 10 వికెట్ల వరకు అవకాశం ఉంటుంది.. పదో వికెట్ పడితే జట్టు ఆల్ అవుట్ అయినట్టు ప్రకటిస్తారు. అలాగే సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కనుక కోల్పోతే ఆ జట్టు ఆల్ అవుట్ అయినట్టు.. ఆ లెక్కన బుధవారం రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రాజస్థాన్ జట్టు లో హిట్ మేయర్, రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేసేందుకు వచ్చారు..స్టార్క్ బౌలింగ్ వేశాడు.. తొలి బంతిని యార్కర్ గా వేయగా.. స్ట్రైకర్ గా ఉన్న హిట్ మేయర్ దానిని కొట్టలేకపోయాడు. దీంతో తొలి బంతికి పరుగు రాలేదు. ఇక రెండవ బంతిని హిట్ మేయర్ ఫోర్ కొట్టాడు
. మూడో బంతికి సింగిల్ రన్ తీశాడు. నాలుగో బంతి నో బాల్ అయింది. ఆ బంతిని పరాగ్ ఫోర్ కొట్టాడు..ఫ్రీ హిట్ గా వేసిన మరుసటి బంతికి పరాగ్ రన్ అవుట్ అయ్యాడు. ఇక ఐదవ బంతికి హిట్ మేయర్ రన్ అవుట్ అయ్యాడు.. దీంతో అంపైర్లు రాజస్థాన్ జట్టు ఆల్ అవుట్ అయినట్టు ప్రకటించారు.
Also Read: సూపర్ ఓవర్ టై అయితే.. విజేతను ఎలా నిర్ణయిస్తారు?
గెలుపు దాకా వచ్చి
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపు దాకా వచ్చింది. అయితే చివర్లో ధృవ్ జూరెల్ నిర్లక్ష్యం వల్ల క్విక్ డబుల్ కు బదులు సింగిల్ రన్ రావడంతో.. రాజస్థాన్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఇక చివరి బంతికి రెండు పరుగులు తీయాల్సిన సమయంలో.. రెండవ పరుగు తీయడానికి ప్రయత్నిస్తుండగా ధృవ్ జూరెల్ రన్ అవుట్ అయ్యాడు.. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా టై అయింది. అయితే సూపర్ ఓవర్లో రాజస్థాన్ జట్టు మరోసారి విఫల ప్రదర్శన చేసింది. యశస్వి జైస్వాల్ ను కనుక దింపి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ హిట్ మేయర్ తన సహజ శైలికి సిద్ధమైన షాట్లు ఆడ లేకపోయాడు. అంతేకాదు తొలి బంతికి పరుగులు తీయలేక ఇబ్బంది పడ్డాడు. స్టార్క్ కూడా రాజస్థాన్ ఆటగాళ్ల బలహీనతను గమనించి బంతులు వేయడంతో ఊహించినంత పరుగులు రాలేదు. పైగా హిట్ మేయర్, రియాన్ రన్ అవుట్ కావడం రాజస్థాన్ జట్టు భారీగా పరుగులు చేయకుండా నిరోధించింది. ఇక రాజస్థాన్ విధించిన టార్గెట్ ను ఢిల్లీ నాలుగు బంతుల్లోనే పూర్తి చేసింది. తద్వారా ఉత్కంఠ భరితమైన మ్యాచ్లో చివరి వరకు పోరాడి.. అంతిమంగా విజేతగా నిలిచింది. తన పోరాటపటిమ ద్వారా ఐపీఎల్లో మిగతా జట్లకు ఢిల్లీ చాలా గట్టి హెచ్చరికలు పంపింది.
Also Read: ఇప్పుడే కాదు.. గతంలోనూ ఢిల్లీ “సూపర్” విన్నరే.. ఎన్నిసార్లు ఇలా గెలిచిందంటే..