Easter Eggs: క్రిస్టియన్లు లోక రక్షకుడిగా ఏసుక్రీస్తును పూజిస్తారు. అయితే ప్రతే ఏడాది ఎంతో ఘనంగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. దీని తర్వాత ఈస్టర్ పండుగను కూడా జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజు ఏసుక్రీస్తుకి శిలువ వేయగా.. అతను మళ్లీ ఈస్టర్ రోజు విజయం సాధించి కొత్త జీవితాన్ని ప్రారంభించిన రోజుగా ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండగను ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన జరుపుకుంటారు. అయితే ప్రతీ ఏడాది ఒకే రోజు ఈస్టర్ పండుగను జరుపుకోరు. ఒక్కో ఏడాది ఒక్కో రోజు వస్తుంది. ఈస్టర్ పండుగ అనేది వసంత రుతువు ప్రారంభానికి ముందు వస్తుంది. అయితే ఈ వసంత కాలంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నాడు ప్రతీ ఏడాది జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఈస్టర్ పండుగను అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈస్టర్ పండుగ నాడు ఎగ్స్‌ను రకరకాలుగా తయారు చేస్తారు. అసలు ఈస్టర్ ఎగ్స్ అంటే ఏమిటి? ఈ పండుగ నాడు ఎందుకు ఈస్టర్ ఎగ్స్ తయారు చేస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: సూపర్ ఓవర్ లో RR ఐదు బంతులే ఎందుకు ఆడింది?
ఈస్టర్ ఎగ్స్ అంటే?
ఈస్టర్ పండుగ రోజు ఎగ్స్ ఉపయోగిస్తారు. వీటిని ఈస్టర్ ఎగ్స్ అంటారు. అంటే వివిధ రకాల కోడిగుడ్లను వివిధ రంగులో అలకరిస్తారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. చూడటానికి చాలా ఆకర్షిణీయంగా కనిపిస్తాయి. ఈ ఆచారం పురాతన కాలం నుంచి వచ్చింది. ఐరోప, మధ్య ప్రాచీ దేశాల్లో ఈ ఈస్టర్ ఎగ్స్‌ను ఈస్టర్ పండుగ నాడు ఇతరులకు ఇస్తారు. అయితే ఈస్టర్ ఎగ్స్ ఇతరులకు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈస్టర్ ఎగ్స్‌ను ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం వల్ల సంతాన కలుగుతుందని నమ్ముతారు. అందుకే ఈస్టర్ పండుగ నాడు వీటితో పాటు మరికొన్ని తీసుకొచ్చే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఈస్టర్ నాడు కుందేలు కూడా తీసుకొచ్చే సంప్రదాయం ఉంది. వీటిని దాచి ఆడుకునే అలవాటు కూడా ఉంది. దీన్ని ఎక్కువగా చిన్న పిల్లలు మాత్రమే ఆడుకుంటారు. ఇవి దొరికితే సంతాన ప్రాప్తి తప్పకుండా వస్తుంది. ఈ ఎగ్స్ దొరికితే సంతోషం, సిరిసంపదలు, మంచి ఆరోగ్యం, ఏసుక్రీస్తు రక్షణ కలుగుతుందని నమ్ముతారు. అలాగే రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే జీవితంలో సంతోషం ఏర్పడుతుందని నమ్ముతారు.
ఈస్టర్ కోసం గుడ్లను అలంకరించే సంప్రదాయం అనేది 13వ శతాబ్దం నాటి నుంచి ఉంది. అయితే గతంలో ఈ సమయంలో గుడ్లు తినడం, మాంసాహారంతో పాటు పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు కూడా తీసుకునే వాళ్లు కాదు. ఈ ఈస్టర్ ఉపవాసం తర్వాత గుడ్లను తింటారు. అయితే ఈ గుడ్డు కొత్త జీవితానికి చిహ్నంగా భావిస్తారు. ఫస్ట్ కోడిగుడ్లకు బదులు ఆస్ట్రిచ్ గుడ్లును ఈస్టర్ గుడ్లుగా వాడేవారు. ఆ తర్వాత కోడిగుడ్లు ఉపయోగిస్తున్నారు. ఈస్టర్ గుడ్డును చెట్లకు అలంకరిస్తారు. అయితే వీటిని అలంకరించడం 1990 నుంచి ఈ ఆచారం ఉంది.