Tambulam: హిందూ సాంప్రదాయంలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సాంప్రదాయ దుస్తులు, పూజలు, పండ్లు, ప్రసాదాలు, పిండి వంటలు అంటూ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక సంవత్సరం మొత్తంలో చాలా పండుగలు కూడా ఉంటాయి. ఒకసారి పండుగలు మొదలైతే లైన్ గా పండుగలు వస్తుంటాయి. ఇల్లు మొత్తం సందడిగా ఉంటుంది. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తాంబూలం ఇవ్వడం కూడా ఆనవాయితీ. చాలా మంది మహిళలు ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు.
వరలక్ష్మీ వ్రతం, శ్రావణ శుక్రవారాలు, గణపతి పూజ, కార్తీక మాసం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పూజల్లో తాంబూలం ఇస్తుంటారు స్త్రీలు. అయితే వీటిని ఇచ్చే విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఇష్టం ఉన్నట్టు తాంబూలం ఇవ్వకూడదట. కాళ్లకు పసుపు పెట్టి ముత్తైదువులకు ఈ తాంబూలం సమర్పిస్తుంటారు.
బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు చివర్లు, అరటి పండ్ల చివర్లు ఇచ్చే వారి వైపుకు కాకుండా తీసుకునే వారి వైపు అంటే మీకు వ్యతిరేక దిశలో ఉండాలి. చివరలను వారి వైపు ఉంచి ఇస్తే ఇచ్చిన తాంబూలం ఇచ్చిన ఫలం ఉండదట. వృధాగా పోతుంది అంటారు నిపుణులు.
తమలపాకులు మూడు గానీ ఐదు గాని పెట్టాలట. ఇక వక్కలు, పండ్లు రెండు ఉండాలి. ఏక పండు తాంబూలం ఎప్పుడు కూడా ఇవ్వద్దట. ఇక కొందరు కాళ్లకు మొక్కడం ఇష్టం లేకుండా ఆశీర్వాదాలు తీసుకోరు. ఇలా చేసిన ఫలం దక్కదట. తాంబూలం స్వీకరించిన వారిని సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చిందని అనుకుంటూ ఆశీర్వాదాలు తీసుకోవాలి. మరి తెలుసుకున్నారు కదా ఈ సారి మీరు తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.