Varalakshmi Vatram : శ్రావణ మాసంను ఆధ్యాత్మిక మాసం అనవచ్చు. ఈ నెలలో పూజలు, వ్రతాలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ సోమవారం మొదలుకొని శని వారం వరకు ప్రతీ వారం ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈనెలలోనే నిర్వహించుకుంటారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకత ఉంటుంది. ఈ పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో లక్ష్మీదేవతకు పూజలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిష్టంగా ఉండి అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఎంతో ఫలితం ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. అలాగే వరలక్ష్మీ వ్రతం రోజూ అమ్మవారి అనుగ్రహం పొందితే జీవితంలో ఎలాంటి ఆర్థిక బాధలు ఉండవని చెబుతారు. అందుకే దాదాపు మహిళలంతా వరలక్ష్మీ వ్రతంలో పాల్గొంటారు. అయితే ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతున్నవారు వరలక్ష్మీ వ్రతం రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల విముక్తి కలుగుతుందని ఆధ్యాత్మిక వాదుల అభిప్రాయం. ఇంతకీ వరలక్ష్మీ వ్రతం రోజు ఏం చేయాలంటే?
ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16న రాబోతుంది. ఈ మేరకు ఇప్పటికే మహిళలు వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యారు. హిందూ శాస్త్రం ప్రకారం శుక్రవారం ఉదయం 5.57 గంటల నుంచి మధ్యాహ్నం 1.18 గంటల వరకు వివిధ రాశిలో పూజలు నిర్వహించుకోవచ్చు. ఇంటిని శుభ్రం చేసిన తరువాత స్నానం చేసి పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోాలి. ఆ తరువాత మండపంపై బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. ముగ్గుపై అమ్మవారి చిత్ర పటం ఉంచాలి. ఆ తరువాత చిత్రపటాన్ని అలంకరించాలి. తెల్లటి దారానికి ఐదు లేక 9 పూలు ఉంచాలి. ఇవి పీటం వద్ద ఉంచి అక్షింతలు, కంకణాలు తయారు చేసుకోవాలి. ఆ తరువాత పూజా విధానం మొదలుపెట్టాలి.
ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్న వారు వరలక్ష్మీ వ్రతం రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా విముక్తి పొందుతారు. ఇందులో కోసం ముందుగా ఉదయం స్నానం చేసిన తరువా మహాలక్ష్మీ అమ్మవారి చిత్రటం వద్ద 11 పసుపు కొమ్ములు ఉంచాలి. ఆ తరువాత గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టాలి. వాటిని బీరువాలో లేదా ఎప్పుడూ తాకని ప్రదేశంలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం వర్దిల్లుతుంది. అంతేకాకుండా ఏ పని చేపట్టినా బంగారమే అవుతుంది. అలాగే వరలక్ష్మీ పూజ తరువాత ఇతరులు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించాలి. దీంతో వారికి ఫలితం ఉంటుంది.
వరలక్ష్మీ వ్రతం చేసేటప్పడు కొన్ని నియమాలు పాటించాలి. అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసుకునేటప్పుడు రెండు ఏనుగు బొమ్మలు కూడా పెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అమితంగా సంతోషిస్తుంది. అలాగే ఆవు నెయ్యితో చేసిన ఆహార పదార్థాలు, కొబ్బరికాయ, అరటి పండు వంటివి నైవేద్యంగా ఉంచుకోవాలి. వీటితో పూజకు ఫలితం ఉంటుంది.