https://oktelugu.com/

Vedaa Movie Review: ‘వేద ‘ ఫుల్ మూవీ రివ్యూ…

బాలీవుడ్ ఇండస్ట్రీ కి గత కొన్ని రోజుల నుంచి సరైన సక్సెస్ అయితే లేదు. మరి ఈ సినిమాతో జాన్ అబ్రహం టీమ్ భారీ సక్సెస్ ని అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ పేరు నిలబెట్టే ప్రయత్నం చేశాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : August 15, 2024 12:11 pm
Vedaa Movie Review

Vedaa Movie Review

Follow us on

Vedaa Movie Review: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలైతే లేకుండా పోయాయి. దానికి కారణం ఏంటి అంటే అక్కడ నుంచి టాప్ హీరోల సినిమాలు వస్తున్న కూడా అవి ఆశించిన మేరకు సక్సెస్ లను సైతం సాధించలేకపోతున్నాయి. ఇక దానివల్ల బాలీవుడ్ ప్రేక్షకులు సౌత్ సినిమాలకు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే జాన్ అబ్రహం హీరోగా శర్వారి వాగ్, తమన్నా, అభిషేక్ బెనర్జీ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా వేద… అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ కి గత కొన్ని రోజుల నుంచి సరైన సక్సెస్ అయితే లేదు. మరి ఈ సినిమాతో జాన్ అబ్రహం టీమ్ భారీ సక్సెస్ ని అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ పేరు నిలబెట్టే ప్రయత్నం చేశాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆర్మీ ఆఫీసర్ గా ఉన్న అభిమన్యు (జాన్ అబ్రహం) టెర్రరిస్టుల దాడిలో తన భార్య (తమన్నా) ను కోల్పోతాడు. ఇక దాంతో ఆ టెర్రరిస్టుల పైన ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలన్స్ ఉద్దేశ్యంతో అభిమన్యు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని చంపేస్తాడు. ఇక ఈ ప్రాసెస్ లో అభిమన్యు తన భార్య తన భార్య మరణాన్ని తట్టుకోలేక పై అధికారుల చెప్పే మాటలను సైతం పట్టించుకోకుండా ఆ టెర్రరిస్టులను చంపడంతో అభిమన్యుని ఆర్మీ ఆఫీసర్ గా తను నిర్వర్తించే విధుల నుంచి సస్పెండ్ చేస్తారు…దీంతో అభిమన్యు తన భార్య ఊరు అయిన బర్మార్ కి వెళ్లి అక్కడ బాక్సింగ్ కొచ్ గా జాయిన్ అవుతాడు. ఇక ఇక్కడ ఆ చుట్టు పక్కల ఉండే కొన్ని వందల ఊర్లకు పెద్ద మనిషి గా జితేందర్ ప్రతాప్ సింగ్ (అభిషేక్ బెనర్జీ) ఉంటాడు. ఇక ఇదే సమయం లో అక్కడి జనాలు ఎదురుకుంటున్న కొన్ని సమస్యల మీద అభిమన్యు ఎలా పోరాటం చేశాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు నిఖిల్ అద్వాని బేసిగ్గా తక్కువ కులాల మీద ఎక్కువ కులాల వారు చెలాయించే ఆధిపత్యం గురించి చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ పాయింట్ మీద దాదాపు చాలా సంవత్సరాల నుంచి కొన్ని వందల సినిమాలైతే వచ్చాయి. కాబట్టి ఇది సినిమా చూసే ప్రేక్షకుడికి రొటీన్ కాన్సెప్ట్ గా అనిపిస్తుంది. అలాగే దర్శకుడు కూడా స్క్రీన్ ప్లే లో వైవిధ్యమైన ఎలిమెంట్స్ ని అయితే ఏమీ చూపించలేదు. సినిమా మొత్తం మొదటి నుంచి చివరి వరకు చాలా ప్లాట్ గా వెళుతుంది… ఒక్కచోట కూడా మనకు హై మూమెంట్ ఇచ్చే సీన్స్ ఒక్కటి కూడా ఉండకపోవడం విశేషము… ఇక మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ సినిమాని ఎంగేజ్ చేయడంలో మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి.

మరి ఇలాంటి సందర్భంలో దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ పాయింట్ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లేతో గాని, తన మేకింగ్ స్టైల్ తో గాని సినిమాకి కొత్త రకమైన రంగులు అద్దవచ్చు కానీ దర్శకుడు దానిమీద ఏమాత్రం ఫోకస్ చేయనట్టుగా కనిపిస్తుంది. అందువల్లే ఇది ఒక సాదాసీదా రొటీన్ మాదిరిగానే అనిపిస్తుంది. తప్ప ఈ సినిమాని చూడటానికి మనం థియేటర్ కి ఎందుకు వెళ్లాలి అని చెప్పడానికి ఒక్క పాయింట్ కూడా మనకు కనిపించడం లేదు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే జాన్ అబ్రహం ఎప్పటి మాదిరిగానే తన ఇంటెన్స్ యాక్టింగ్ తో సినిమాని మొదటి నుంచి చివరి వరకు తన భుజాల మీద మోసుకెళ్ళడనే చెప్పాలి… ఇక తమన్నా , శార్వరి వాగ్ ఇద్దరు హీరోయిన్లుగా తమ పరిధి మించకుండా వాళ్లు కనిపించినంత సేపు చాలా బాగా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశారు… ఇక అభిమన్యు బెనర్జీ ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చినప్పటికీ పాత్ర రాసుకున్న విధానం పెద్దగా ఎంగేజ్ చేయలేదు అందువల్లే ఆయన ఎంత బాగా నటించినప్పటికీ ఆయన క్యారెక్టర్ లో ఏదో తెలియని ఒక చిన్న అసంతృప్తి అయితే ఉంటుంది… ఇక మిగిలిన నటీనటులు వాళ్ల పాత్రలకు పరిమితం అవ్వడమే కాకుండా వాళ్లకు లభించిన స్క్రీన్ స్పేస్ లో వారిని ప్రేక్షకుల మెప్పు పొందే విధంగా నటించడానికి ప్రయత్నం అయితే చేశారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముందుగా ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండు కూడా ఆశించిన మేరకు అయితే లేవు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ కొంతవరకు ఒకే అనిపించినప్పటికీ వాటిని ప్రాపర్ గా వాడలేదనే చెప్పాలి. కొన్ని సీన్లకు కొన్ని షాట్స్ మిస్ మ్యాచ్ అయ్యాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో అయితే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది…

ప్లస్ పాయింట్స్

జాన్ అబ్రహం యాక్టింగ్
సెకండ్ హాఫ్ లో ఊరిలో వచ్చే కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్

రోటీన్ కథ
మ్యూజిక్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్

రేటింగ్
ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2/5

చివరి లైన్

వేద కూడా బాలీవుడ్ ను కాపాడలేకపోయింది…

 

Vedaa - Official Trailer | John Abraham | Sharvari | Abhishek B | Nikkhil A | In Cinemas 15th Aug