Rotten Pumpkins: ఇంటికి కట్టిన గుమ్మడికాయ కుళ్లిపోయిందా? వెంటనే ఇలా చేయండి.

ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక చాలా కారణాలుంటాయట. గుమ్మడికాయ గుమ్మానికి ఉంటే ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టే అంటారు కొందరు. దీని వల్ల ఎలాంటి ప్రతకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదట.

Written By: Swathi Chilukuri, Updated On : October 8, 2024 3:50 pm

Rotten Pumpkins

Follow us on

Rotten Pumpkins :  నరదృష్టి అనే మాట వినే ఉంటారు. ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు చూసి ఓర్వలేక చెడు కోరుకునే వారి వల్ల నరదృష్టి కుటుంబం మీద పడుతుందని విశ్వసిస్తారు కొందరు. ఈ ప్రభావం పడితే జరగకూడని సంఘటనలు జరుగుతాయి. అనారోగ్యం బారిన పడటం, అనవసర వివాదాలు సంభవిస్తాయి అంటున్నారు పండితులు. వ్యాపారంలో అయితే చెడుదృష్టి తగిలితే నష్టాలు వస్తాయి అంటున్నారు మరికొందరు. అందుకే ఇలాంటి ప్రతికూల చూపు సోకకుండా కొన్ని నియమాలు పాటించాలి.. ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక చాలా కారణాలుంటాయట. గుమ్మడికాయ గుమ్మానికి ఉంటే ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టే అంటారు కొందరు. దీని వల్ల ఎలాంటి ప్రతకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదట.

ఇక జీవితంలో ప్రతి వ్యక్తి సొంత ఇంటి కల ఉంటుంది. దాని కోసం కచ్చితంగా ఓ ఇల్లును నిర్మించుకుంటారు. ఈ క్రమంలోనే సొంతింటి కలను నిజం చేసుకుంటుంటారు కూడా చాలా మంది. అయితే ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా వాస్తును తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే చాలా నష్టాలు వస్తాయట. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించినా సరే ఇంటిపై దిష్టి ఉంటే కూడా సమస్యలు వస్తుంటాయి. అయితే ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు ప్రజలు.

అందులో ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం ఎక్కువ చూస్తుంటాం. బూడిద గుమ్మడికాయలు సంవత్సరంలో ఎప్పుడు అయినా లభిస్తాయి. గృహ ప్రవేశం, ఇతర సందర్భంలో అయినా సరే చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద బూడిద గుమ్మడికాయను కడుతుంటారు. దీంతో నరఘోష, దిష్టి, నర పీడలు తొలిగిపోతాయని, కొత్తగా కూడా చేరవు అనే నమ్మకం ఉంది.. ఇక బూడిద గుమ్మడికాయను సాక్షాత్తూ కాలభైరవ స్వామి స్వరూపంగా విశ్వసిస్తారు ప్రజలు. అందువల్ల బూడిద గుమ్మడికాయను కడితే దిష్టి తగలదు అంటారు.

కొన్ని సందర్భాల్లో బూడిద గుమ్మడికాయను కట్టిన తరువాత కొన్ని రోజులకే కుళ్లిపోతుంది. ఇక ఇందుకు అర్థం ఏంటి అనుకుంటున్నారా? బూడిద గుమ్మడికాయ త్వరగా కుళ్లిపోతే ఆ ఇంటికి దిష్టి బాగా ఉందని అర్థం. వెంటనే ఇంకో బూడిద గుమ్మడికాయను కట్టాలి. లేదంటే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.

బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. గుమ్మడికాయను కట్టాలి అనుకుంటే ముందు రోజు సాయంత్రమే దానిని తీసుకొచ్చి తరువాతి రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించాలి. గుమ్మడికాయకు పసుపు, కుంకుమ రాసి ఇంటి ముందు వేలాడదీయాలి. ఇలా చేసిన తర్వాత ప్రతి రోజు మనం పూజ చేసేటప్పుడు రెండు అగరొత్తులని వెలిగించి ధూపం వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ విధమైన చెడు ఉండదు. అంతేకాదు గుమ్మడికాయని బుధవారం, గురువారం లేదా ఆదివారాలలో మాత్రమే కట్టుకోవాలి అంటున్నారు పండితులు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..