Puja Tips: దేవుళ్లను పూజించడానికి ముఖ్యంగా పూలు కావాల్సిందే. పూలు లేకుండా పూజ చేస్తే ఆ పూజ పూర్తి అయినట్టు అనిపించదు. ఎన్నో రకాల పూలతో ఆ దేవదేవుళ్లను కొలిస్తే బాగుంటుంది. అయితే కొన్ని పూలు పూజకు పనికి రావు అంటారు పండితులు. అంతేకాదు కొన్ని పూల వల్ల దేవుళ్లు ఆగ్రహానికి గురి అవుతారట. అందులో ముఖ్యంగా కొన్ని పూలు అసలు ఉపయోగించకూడదు అట. ఇంతకీ ఆ పూలు ఏమంటే..
పరమేశ్వరుడికి భక్తితో పూజ చేస్తే చాలు ఇట్టే కరిగిపోతాడు. ఆ భోళాశంకరుడికి కోపం కూడా ఎక్కువే. అయితే మొగలిపూవులతో శివయ్యకు పూజ చేయకూడదు. అలా చేస్తే శివుడి ఆగ్రహానికి గురి కాక తప్పదట. శ్రీరాముడికి గన్నేరు పూలతో పూజ చేయకూడదు. గన్నేరు పూలతో పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరవట.
శ్రీ మహా విష్ణువును పూజించే సమయంలో కూడా కొన్ని పూలకు దూరంగా ఉండడం మంచిది. అందులో ముఖ్యంగా అగస్త్య పుష్పాలతో ఆ మహా విష్ణువును అసలు పూజించకూడదు. ఇలా చేస్తే కూడా మహావిష్ణువు ఆగ్రహం వ్యక్తం చేస్తారట. దుర్గాదేవికి కిందపడిన పూలు, ఘాటు వాసన ఉన్న పూలతో అసలు పూజించకూడదు. ఇలాంటి పుష్పాలు ఆ తల్లికి నచ్చవట.
సూర్య భగవానుడికి బిల్వ పత్రాన్ని సమర్పించకూడదు. ఆ ప్రత్యక్ష దైవానికి బిల్వ పత్రంతో పూజిస్తే ఆయనకు ఆగ్రహం వస్తుందట. పార్వతీదేవికి పూజ చేస్తున్నప్పుడు జిల్లేడు, ఉమ్మెత్త పూలతో అసలు పూజ చేయకూడదు. ఇలా చేయడం వల్ల కోరికలు నెరవేరవట. శివయ్యకు ఇష్టమైన పార్వతీదేవికి పూజ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త.