Health Tips: ఉదయం లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఆ తర్వాత తలస్నానాలు ఆచరించి పూజించడం మన హిందూ సాంప్రదాయం. కానీ కొందరు మాత్రం ఇలాంటివి పాటించరు. రెండు రోజులకు ఒకసారి స్నానం చేసే వారు కూడా ఉంటారు. ప్రతి రోజు స్నానం చేస్తేనే మన శరీరంలో కొన్ని అవయవాలలో మురికి సరిగ్గా పోదట. అలాంటిది క్రమం తప్పకుండా స్నానం చేయకపోతే వారి శరీరంలో ఎన్ని బ్యాక్టీరియాలు పేరుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొన్ని సార్లు శుభ్రపరిచిన తర్వాత కూడా శరీరంలో ఒక స్థలం మాత్రం చాలా మురికిగా ఉంటుందట. అన్ని అవయవాలను జాగ్రత్తగా చూసుకుంటున్నా కూడా ప్రతి ఒక్కరూ ఈ అవయవాన్ని మాత్రం మర్చిపోతారు అని టాక్. ఇంతకీ ఏంటంటే.. బాడీ మిడిల్ పాయింట్ నాభి. ఈ నాభి వద్దనే 2,368 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయని గతంలో చేసిన ఓ సర్వేలో తేలింది. వీటిలో 1,458 కొత్త జాతులు అని తెలిపారు శాస్త్రజ్ఞులు.
ఈ ప్రాంతంలో ఎక్కువగా చెమట పడుతుంది. ఇది నిస్సారంగా ఉన్నందున శుభ్రం చేయడం అంత సులభం కాదని తెలుస్తోంది. ఈ నాభి వద్ద చాలా మందిలో దుర్వాసన వస్తుంటుంది. బ్యాక్టీరియా పెరగడమే ముఖ్యమైన కారణం అంటారు నిపుణులు. వాస్తవానికి ఈ నాభి శరీరంపై ఉన్న గాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. పుట్టినప్పుడు తల్లి నుంచి బిడ్డను వేరు చేసినప్పుడు ఈ గాయం ఏర్పడుతుంది. అయితే బొడ్డు తాడు కాయిల్ లోపలికి ఉంటుంది.
నాభి బ్యాక్టీరియా సంతానోత్పత్తికి అనువైన ప్రదేశం అంటారు చర్మ వ్యాధి నిపుణులు. ఇక ఈ నాభిని ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. గోరువెచ్చని నీటిలో వాష్ క్లాత్ తీసుకొని సబ్బు నీటిలో ముంచుతూ కూడా మీరు ఈ నాభిని వాష్ చేసుకోవచ్చు. నాభి ఎర్రగా కందిన, దుర్వాసన వచ్చినా, దురద వచ్చినా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.