Homeలైఫ్ స్టైల్Health Tips: వాకింగ్ అవసరం లేకుండా ఈ 4 పనులు చేస్తే బరువు తగ్గుతారు..

Health Tips: వాకింగ్ అవసరం లేకుండా ఈ 4 పనులు చేస్తే బరువు తగ్గుతారు..

Health Tips:  ఆరోగ్యానికి వ్యాయమం తప్పనిసరి. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బిజీగా ఉండడంతో ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తున్నారు. దీంతో అనేక కొత్త రోగాలు వస్తున్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు రోజూవారీ జీవితంలో శారీరక శ్రమ తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. సాప్ట్ జాబ్స్ చేసేవాళ్లు బరువు తగ్గాలంటే రోజులో కనీసం కొన్ని నిమిషాలైనా వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతారని అంటున్నారు. అయితే చాలా మందికి సమయం లేకపోండంతో వాకింగ్ చేయడం కుదరడం లేదు. వాకింగ్ చేయాలని ఉన్నా ఒక్కోసారి శరీరం సహకరించదు. ఈ నేపథ్యంలో వాకింగ్ కు ప్రత్యామ్నాయంగా ఇలా చేస్తే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

స్కిప్పింగ్:
చిన్నప్పుడు స్కూళ్లలో చదువుకునేటప్పుడు స్కిప్పింగ్ ను గేమ్ లో భాగంగా చేర్చేవారు. కానీ ఇప్పుడు ఇది ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలోని బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇది సింగిల్ గా కాకుండా సన్నిహితులతో కలిసి గేమ్ లగా ఏర్పాటు చేసుకొని స్కిప్పించ్ చేయడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారంటున్నారు. స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాల గట్టిపడుతాయి. చెమటకు బయటకు తీస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

ట్రెక్కింగ్:
కొందరు ఖాళీ సమయం దొరికితే సినిమాలు, షికార్లకు వెళ్తుంటారు. ఈ సమయాన్ని ట్రెక్కింగ్ కు ఉపయోగిస్తే మనసు ఉల్లాసంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ట్రెక్కింగ్ చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ట్రెక్కింగే చేసే ప్రదేశాలు తక్కువే ఉంటాయి. అయితే తీరిక దొరకినప్పుడల్లా ట్రెక్కింగ్ ను ఎంచుకోవడం ఉత్తమం అనిఅంటున్నారు.

మెట్లు ఎక్కడం:
నేటి కాలంలో పెద్ద పెద్ భవనాలు నిర్మీతమవుతున్నాయి. దీంతో వాటిల్లో లిప్ట్ లు తప్పనిసరిగా ఉంటున్నాయి. చాల వరకు పై ప్లోర్ కు అర్జంట్ గా వెళ్లాలంటే లిప్ట్ ను వాడడంలో తప్పు లేదు. కానీ సమయం ఉన్నప్పుడు లిప్ట్ ను అవైడ్ చేసి మెట్ల మీద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇలా ప్రతి రోజూ కనీసం రెండు సార్లు అయినా మెట్ల ఎక్కడం వల్ల కాళ్ల కండరాలు గట్టిపడుతాయి. ఎక్కువ శాతం మెట్లు ఎక్కడం వల్ల బరువును అదుపులో ఉంచుతుంది.

డ్యాన్స్:
కొందరు చిన్నప్పుడు బాగా డ్యాన్స్ చేస్తారు. కానీ పెద్దయ్యాక సిగ్గుపడుతారు. కానీ ఇష్టమైన మ్యూజిక్ తో ప్రతిరోజూ డ్యాన్స్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ చేయడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడుతారు. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అయితే ఇంట్లో ఎవరూ లేనప్పుడు బిగ్గరగా సౌండ్ వేసుకోవడం ద్వారా ఎక్కువ సేపు డ్యాన్స్ చేయగలుగుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version