Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మనకి కొన్ని రకాల పండ్ల గురించి మాత్రమే తెలుసు. అయితే మనకి తెలియని చాలా రకాల పండ్లు మార్కెట్లో ఉన్నాయి. కొన్ని రకాలు పండ్లను డైలీ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. పండ్లను డైలీ లైఫ్‌లో అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా కూడా ఉంటారు. పండ్లు డైలీ తినడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే కేవలం పండ్లు వల్ల మాత్రమే కాకుండా కొన్ని పండ్లు ఆకుల వల్ల కూడా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది షుగర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల కొన్ని ఆహార పదార్థాలను అసలు తినలేకపోతున్నారు. మారిన జీవనశైలి, ఆహార విషయంలో మార్పులు వంటి కారణాల వల్ల చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే కొన్ని పండ్ల ఆకులతో డయాబెటిస్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఆ పండు ఏంటి? దాని ఆకులను ఎలా ఉపయోగిస్తే డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చాలామందికి పాషన్ ఫ్రూట్స్ గురించి పెద్దగా తెలియదు. సీజనల్‌గా దొరికే ఈ పండును తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తినకూడదు. కానీ ఈ పాషన్ పండును డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. అయితే ఈ పండు మాత్రమే కాకుండా దీని ఆకులు కూడా డయాబెటిస్‌కి బాగా ఉపయోగపడతాయి. ఈ పండు ఆకులతో కషాయం చేసుకుని తాగితే తొందరగా డయాబెటిస్ తగ్గుతుంది. తాజా ఆకులను తీసుకుని బాగా శుభ్రం చేయాలి. వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత కాస్త చల్లార్చి ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగితే మధుమేహం తగ్గుతుంది. ఈ ఆకులు, పండ్లు డయాబెటిస్ వారికి బాగా ఉపయోగపడుతుంది.
ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. ఈ పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ కషాయం వల్ల కళ్లు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పండులో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డైలీ ఈ పండు తినడం లేదా ఆకులు జ్యూస్ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగు పడుతుంది. ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు ఈ పండును తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇందులో క్యాన్సర్ కారకాలను నిరోధించే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధుల నుంచి విముక్తి చెందవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.