Chanakyaniti : నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. నీరు మనిషికి చాలా అవసరం. ఆహారం కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కానీ నీరు మాత్రం ఆలస్యం కావద్దు అంటారు నిపుణులు. ప్రతి రోజు వయసును బట్టి తగినంత నీరు తాగాలి. ఇక పెద్ద వారు కచ్చితంగా ఆరు నుంచి ఏడు లీటర్ల నీరు తీసుకోవాలి. దీని వల్ల చాలా వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అయితే నీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిసిందే. అయితే నీరు కొన్ని సార్లు విషయంగా కూడా మారుతుంది అంటున్నారు నిపుణులు. ఇది నమ్మడానికి మీకు సమయం పట్టవచ్చు కానీ ఇది వాస్తవం. మరి నీరు విషయంగా ఎప్పుడు మారుతుంది అనే వివరాలు తెలుసుకుందామా?
నీళ్లను ఎప్పుడు త్రాగకూడద అంటే?: దేశంలోని ఎంతో మంది గొప్ప గొప్ప పండితులలో ఆచార్య చాణక్య ఒకరు. ఈయన ఎన్నో విషయాలకు పరిష్కారం చెప్పారు. ఇక సరికాని సమయంలో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలా హానికరమో ఆయన తెలిపారు. మరి ఈ విషయంలో చాణక్యుడు ఏం చెప్పారంటే?
చాణక్య నీతి శ్లోకం
అజీర్ణే భేషజన్ వారి జీర్ణే వారి బలప్రదమ్ ।
భోజనే చామృతం వారి భోజనన్తే విశ్వప్రదమ్ ।।
ఇక శ్లోకం మీకు అర్థం అయిందా? మరి దీని అర్థం ఏంటంటే? అజీర్తి సమయంలో నీరు తాగడం వల్ల ఔషధంగా మారుతుంది. ఇక నీరు వృద్ధులకు కూడా శక్తినిస్తుంది. భోజనంలో కొద్దిగా మాత్రమే నీరు ఉండాలి. అప్పుడే అమృతంలాంటిది. భోజనం తర్వాత వెంటనే నీరు తాగవద్దు. తాగితే అది విషంలా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు.
అజీర్తి సమయంలో, అంటే ఆహారం జీర్ణం కానప్పుడు నీరు తాగడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అంటే ఈ సమయంలో ఎలాంటి సంకోచం లేకుండా కూడా నీరును తాగవచ్చు. కానీ ఆహారం తిన్న తర్వాత వెంటనే అసలు నీరు తాగవద్దు. దీని వల్ల చాలా సమస్యలు మొదలు అవుతాయి అన్నారు ఆచార్య చాణక్యుడు. ఇక వృద్ధులకు అధిక నీరు అవసరం అని తెలిపారు. వృద్ధులు ఎప్పటికప్పుడు తగినంత నీరు అవసరం. దానివల్ల వారి శరీరానికి శక్తి వస్తుంది. వృద్ధాప్యంలో ఆహారం తక్కువగా, నీరు ఎక్కువగా తీసుకోవాలి అంటున్నారు ఆయన.
ఇక భోజనం చేసేటప్పుడు మధ్యమధ్యలో కొద్దిగా నీరు తాగాలి. కానీ లిమిట్ గా తాగాలి కానీ ఎక్కువగా తాగవద్దు. ఈ సమయంలో తాగే నీరు ప్రతి ఒక్కరికి అమృతంలా పనిచేస్తుంది. కానీ భోజనం చేసిన వెంటనే నీరు తాగితే మాత్రం అది విషమే అవుతుంది. ఆరోగ్యం కూడా చెడిపోతుంది అంటున్నారు చాణక్యుడు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..