https://oktelugu.com/

sleep : ఈ అలవాట్లు మిమ్మల్ని నిద్ర పోనివ్వవు.. అందుకే జాగ్రత్త

ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో చాలా మందికి నిద్ర పట్టదు. అందుకే మీరు ఏదైనా కోల్పోయే ముందు దానికి కర్త కర్మ క్రియ ఎవరు అని ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని కోల్పోయాక ప్రతీకారం తీర్చుకోవడం కంటే ముందు జాగ్రత్త చాలా అవసరం.

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2025 / 06:29 PM IST

    Sleeping in Light or Dark

    Follow us on

    sleep : చాలా మందికి పడుకున్నా సరే ఎంత సేపు అయినా అసలు నిద్ర రాదు. కొందరు లక్కీ పర్సన్ ఉంటారు ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంది. మంచి నిద్ర పోవాలంటే కూడా అదృష్టం ఉండాలండీ బాబు. ఈ టెక్నాలజీ జిందగీలో నిద్రకు కరువు అయింది. అర్ధరాత్రి వరకు పక్కన్నే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటే రాత్రి ఎక్కడ నిద్ర పడుతుంది. ఫోన్, లాప్, ట్యాబ్, టీవీ వంటివి ఎప్పుడూ పక్కన్నే ఉంటున్నాయి. దీని వల్ల సరైన నిద్ర కూడా ఉండటం లేదు. ఇక ఉదయం కూడా అసలు నిద్ర లేవరు. లేచినా సరే వెంటనే ఫోన్ లో మునిగిపోతుంటారు. ఇక ఇవి మాత్రమే కాదు. మరికొన్ని విషయాలు కూడా నిద్ర పట్టకుండా చేస్తున్నాయట. ఇంతకీ అవేంటంటే?

    నిద్ర లేకుండా చేసే 4 విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

    విదురుని నీతులు: మహాభారత యుద్ధాన్ని ఆపేందుకు విదురుడు ధృతరాష్ట్రుడికి ఎన్నో విషయాలు చెప్పాడు అని వినే ఉంటారు. వీటినే విదుర నీతి అంటారు. ఇందులో జీవితానికి ఉపయోగపడే ఎన్నో సూత్రాలు ఉంటాయి. అయితే ఈ విదుర నీతి ప్రకారం కొన్ని విషయాల వల్ల ఎవరికీ ప్రశాంతంగా నిద్ర ఉండదట.

    కామ వాంఛలు: కామవాంఛలు ఎక్కువగా ఉన్నవారికి కూడా ప్రశాంతంగా నిద్ర పట్టదట. ఈ కోరికలే మనిషిని చెడుదారి పట్టేలా చేస్తాయి. ఇక రాత్రి అసలు నిద్రపోనివ్వవు అంటున్నారు నిపుణులు. మనిషి వీటి నుంచి బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

    బలవంతుడితో శత్రుత్వం: బలవంతుడితో శత్రుత్వం ఉంటే కూడా సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో అనే భయం వారిలో ఉంటుంది. దీని వల్ల వారు ప్రశాంతంగా నిద్ర పోరట. అందుకే మీకంటే బలవంతులు ఉంటే కొన్ని సార్లు శత్రుత్వం కంటే మిత్రుత్వం మంచిది. అయితే ఈ స్నేహం మీకు చెడు జరగనివ్వదు అన్నప్పుడు మాత్రమే చేయాలి. లేదంటే సమస్య నుంచి బయటపడటానికి వీలైనంత త్వరగా దారిని వెతకాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి నిద్ర పడుతుంది.

    అన్నీ పోతే: ఎవరికైనా అన్నీ పోతే, వాటి గురించే ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో చాలా మందికి నిద్ర పట్టదు. అందుకే మీరు ఏదైనా కోల్పోయే ముందు దానికి కర్త కర్మ క్రియ ఎవరు అని ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని కోల్పోయాక ప్రతీకారం తీర్చుకోవడం కంటే ముందు జాగ్రత్త చాలా అవసరం.

    దొంగతనం అలవాటైతే: చాలా మందికి దొంగతనం అలవాటు అవుతుంది. పెరుగుతున్న ఖర్చులకు ఉద్యోగాల కొరతకు చాలా మంది దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. అందుకే రోజు రోజుకు దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. ఇక చైన్ స్నాచింగ్ లు, ఆన్ లైన్ మోసాలు కూడా వీటి కిందకే వస్తాయి. ఇలాంటి దొంగలకు కూడా సరైన నిద్ర ఉండదట. అందుకే ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా సరే వాటిని వదులుకొని మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. దీని వల్ల మీకు సుఖ నిద్ర వస్తుంది.