https://oktelugu.com/

Gautam Gambhir : ఏరి కోరి తెచ్చుకుంటే.. జట్టు పాలిట విలన్ అయ్యాడు.. ఇప్పుడు బీసీసీఐ ఏం చేస్తుందో..

గత ఏడాది ఎండాకాలం.. ఐపీఎల్ విజేతగా కోల్ కతా ఆవిర్భవించింది. పుష్కరకాలం తర్వాత విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టుకు మెంటార్ గా మొన్న గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయిపోయాడు. సెలబ్రిటీకి మించిన హోదాను సొంతం చేసుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 5, 2025 / 06:19 PM IST

    BCCI-Gautam Gambhir

    Follow us on

    Gautam Gambhir : కోల్ కతా ను విజేతగా నిలపడంలో గౌతమ్ గంభీర్ విశేష కృషి చేసిన నేపథ్యంలో.. దానిని గుర్తించిన బీసీసీఐ పెద్దలు వెంటనే రంగంలోకి దిగారు. గౌతమ్ గంభీర్ తో సంప్రదింపులు జరిపారు. “నీకు నచ్చింది చెయ్. నువ్వు కోరుకున్న దానిని అమల్లో పెట్టు.. నువ్వు ఏది చెప్తే అది చేస్తాం. నువ్వు తీసుకునే నిర్ణయాలలో వేలు పెట్టం. కచ్చితంగా నువ్వు ఏది అనుకుంటే అది ఇచ్చేస్తామని” చెప్పేశారు. దీంతో గౌతమ్ గంభీర్ తన మెంటార్ పదవికి రాజీనామా చేశారు. షారుక్ ఖాన్ కి సారీ చెప్పారు. ఆ తర్వాత శ్రీలంక సిరీస్ ద్వారా టీమిండియాలోకి ప్రవేశించారు.

    శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ ను టీమిండియా వైట్ వాష్ చేసింది . ఇంకేముంది గౌతమ్ గంభీర్ ను ఒక్కసారిగా ఆకాశమే హద్దు అన్నట్టుగా మీడియా కీర్తించడం మొదలుపెట్టింది. తర్వాత వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత టీమిండియా శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఇది గౌతమ్ గంభీర్ కు తొలి షాక్. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ ఆడింది. పాకిస్తాన్ ను వారి స్వంత దేశంలో వైట్ వాష్ చేసిన ఊపులో ఉన్న బంగ్లాదేశ్ ను భారత్ నేలకు దించింది. ఈ విజయం గౌతమ్ గంభీర్ ను మళ్లీ ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ ను భారత్ వైట్ వాష్ చేయడంతో గౌతమ్ గంభీర్ మళ్లీ వార్తల్లో వ్యక్తయ్యాడు. ఇక ఈసారి గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయాలకు బీసీసీఐ పెద్దల నుంచి ఏకపక్ష ఆమోదం లభించింది.

    ఇక న్యూజిలాండ్ సిరీస్ మొదలుపెట్టిన తర్వాత.. బెంగళూరులో టీమిండియా 46 పరుగులకే ఆల్ అవుట్ అయిన తర్వాత.. తొలి ఉపద్రవం గౌతమ్ గంభీర్ కు వచ్చేసింది. ఆ టెస్టులో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత మిగతా రెండు టెస్టులలోనూ ఇదే సన్నివేశం పునరావృతమైంది. దీంతో కచ్చితంగా ఆటగాళ్లు రంజీలో ఆడాలని నిబంధన తెరపైకి వచ్చింది. అయితే రంజీలో ఆడిన ఆటగాళ్లకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. ఇది గౌతమ్ గంభీర్ కు కొంతలో కొంత శాంత్వన చేకూర్చింది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన భారత్ 3-1 తేడాతో సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ తో టెస్ట్ చరిత్రలో వైట్ వాష్ కు గురైన టీమ్ ఇండియా.. ఆస్ట్రేలియా చేతిలో రెండు సీజన్ అనంతరం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది.. వైఫల్యాల తర్వాత.. గౌతమ్ గంభీర్ ను జట్టుతో కొనసాగిస్తారా? చాలు బాబు నీ సేవలు అని? బయటికి పంపిస్తారా.. అనే ప్రశ్నలకు బీసీసీఐ పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉంది.