https://oktelugu.com/

Shiva Temple: శివుడి ఆలయంలో ఉడుకుతున్న వేడినీరు.. అంత చిక్కని రహస్యం.. ఎగబడుతున్న జనాలు

భారతదేశం పురాతన ఆలయాలకు నిలయం. ఇక్కడ వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి. వీటిల్లో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. వీటిని సైన్స్ ను ఎక్కువగా నమ్మేవారు ఎంత పరిశోధనలు చేసినా అంతుచిక్కడం లేదు. అలాగే ఓ శివాలయంలో ఉన్న ఒకదాని రహస్యాన్ని ఇప్పటికీ ఎవరూ ఛేదించడం లేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 29, 2024 / 03:15 PM IST

    Shiva temple In kulu

    Follow us on

    Shiva Temple: భారతదేశం పురాతన ఆలయాలకు నిలయం. ఇక్కడ వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి. వీటిల్లో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. వీటిని సైన్స్ ను ఎక్కువగా నమ్మేవారు ఎంత పరిశోధనలు చేసినా అంతుచిక్కడం లేదు. అలాగే ఓ శివాలయంలో ఉన్న ఒకదాని రహస్యాన్ని ఇప్పటికీ ఎవరూ ఛేదించడం లేదు. ఉత్తర భారతదేశంలో ఉన్నఓ శివాలయంలో  ఓ వైపు మంచు గడ్డలు.. మరోవైపు వేడి నీరు కనిపిస్తుంది. ఈ నీరు ఎలా వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ఈ వేడి నీరు ఇలా రావడానికి మాత్రం ఓ చరిత్ర ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? వేడి నీరు రావడానికి కారణం ఏంటి?

    హిమాచల్ ప్రదేశ్ అనగానే చల్లటి ప్రాంతం అని అందరికీ తెలుసు. ఇక్కడ శీతాకాలంలో ఎక్కువగా మంచు కురుస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలోని కులు పట్టణానికి 45 కిలోమీటర్ల ఉన్న మణికరణ్ లో ఓ పురాతన శివాలయం ఉంది. ఇక్కడ పార్వతి దేవి నది ప్రవహిస్తుంది. ఈ నదికి ఒక వైపు శివాలయం మరోవైపు గురుద్వారా ఉంటుంది. నదికి ఓ వైపు ఉన్న శివాలయంలో ఒక వైపు మంచు గడ్డలు కనిపిస్తుండగా.. మరోవైపు ఉడుకుతున్న వేడి నీరు కనిపిస్తుంది. ఇంతటి చల్లటి ప్రాంతంలో ఈ వేడి నీరు ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పటి వరకు కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. కానీ ఏ విషయం తేలలేదు. అయితే దీనికో చరిత్ర  ఉంది.

    పార్వతి దేవి కొలనులో స్నానం చేస్తుండగా.. తన ఆభరణం నుంచి ఒక ముత్యం పడిపోయి పాతాళానికి చేరుతుంది. ఈ విషయాన్ని శివుడికి చెప్పగా తన గణాలను ఉపయోగించి దానిని తీసుకురమ్మంటాడు. కానీ ఎంత వెతికినా ఈ ముత్యం దొరకదు. దీంతో శివుడు ఉగ్ర రూపం దాల్చుతాడు. శివుడి ఆగ్రహానికి  పార్వతి దేవి నది నీరు వేడిగా మారుతుంది. ఇది ఉడుకుతున్నట్లు కనిపిస్తుంది. ఇదే సమయంలో నైనా దేవత ప్రత్యక్షమై పార్వతి ముత్యం విషయాన్ని పాతాళంలో ఉన్న శేషనాగుకు చెబుతుంది. అయితే శేషనాగు బుసలు కొట్టడంతో అక్కడున్న కొన్ని ముత్యాలు వచ్చి భూమిపై పడుతాయి. ఇందులోని పార్వతి దేవికి సంబంధించిన ముత్యాన్ని తీసుకొని మిగతా వాటిని నదిలో వేయడంతో అవి బండరాళ్లుగా మారుతాయి.

    అప్పటి నుంచి ఈ వేడి నీరు ఇలాగే ఉంటూ వస్తోంది. అయితే కొందరు ఈ విషయాన్ని నమ్మక పరిశోధనలు చేశారు. కానీ ఎవరూ ఈ నీరు వేడిగా ఉంటుందో చెప్పలేకపోయారు. ఈ వేడి నీరు ఉష్ణోగ్రత 80 నుంచి 90 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ వేడి నీటిపై ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకుంటారు. అంతేకాకుండా ఈ వేడి నీటితో చల్లటి నీరు కలుపుకొని స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయ విశిష్టత తెలిసిన వారు, ఈ వింత గురించి చూసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న శివుడి అనుగ్రహం పొందేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.