https://oktelugu.com/

Gond Katira Benefits: 60 ఏళ్లలోనూ 30 ఏళ్లలా రెచ్చిపోవాలనుకుంటున్నారా.. అయితే ఈ మూలికలు మీ కోసమే!

పాత కాలంలో మనుషులు చాలా దృఢంగా ఉండేవారు. నాడు వైద్యం ఇంతగా అభివృద్ధి చెందకపోయినా.. రోగాలు వచ్చేవి కావు. సొంత చిట్కాలతోనే వ్యాధులు కూడా నయమయ్యేవి. మారిన ఆహారపు అలవాట్లతో ఇప్పుడు జబ్బులు ముసుకుంటున్నాయి. వైద్యం అభివద్ధి చెందినా.. వ్యాధులు కట్టడి కావడం లేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 30, 2024 / 03:00 AM IST

    Gond Katira Benefits

    Follow us on

    Gond Katira Benefits: ఉరుకులు పరుగుల జీవితంలో నేటి తరం.. ఆహారంపై అంతగా దృష్టి సారించడం లేదు. రెడీమేడ్, ఫాస్ట్‌ ఫుడ్, ప్యాకేజీ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కల్తీ, నకిలీ పదార్థాలతో తయారుచేసిన ఆహారం తీసుకోవడం వలన రోగాలు పెరుగుతున్నాయి. బీపీ, షుగర్‌ వ్యాధులు కామన్‌ అయ్యాయి. ఇక ఒబెసిటీ పెరుగుతోంది. 40 ఏళ్ల వ్యక్తులు కూడా 60 ఏళ్లలా కనిపిస్తున్నారు. చూపు మందగిస్తోంది, వినికిడి లోపం పెరుగుతోంది. పిల్లలో హైపర్‌టెన్షన్‌ పెరుగుతోంది. చిన్నపాటి కష్టానికే నీరస పడుతున్నారు. ఏ పని చేసినా అలసిపోతున్నారు. ఇలాంఇ సమస్యలకు ఒక సహజ మూలికతో చెక్‌ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. ఆ మూలిక తింటే 60 ఏళ్ల వృద్ధుడు కూడా 30 ఏళ్ల యువకుడిలా యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా మారితపోతారట.

    సమజ సిద్ధమైన మూలిక..
    గోండ్‌ కటిర.. ఇది సహజ సిద్ధంగా లభించే ఆయర్వేద మూలిక. శారీరక బలహీనతతో బాధపడుతున్నవారికి ఈ మూలిక మంచి పరిష్కారం చూపుతుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎముకలను పటిష్టం చేస్తుంది. శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కూడా చక్కలి ఫలితాలు ఉంటాయి. దీనిని తింటే మంచి నిద్ర పడుతుంది.

    గ్రామాల్లో…
    ఈ గోండ్‌ కటిర గ్రామాణ ప్రాంతాల్లో సహజంగానే లభిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మార్కెట్లు లేదా ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. గోండ్‌ కటిర అనేది గమ్‌లా కనిపిస్తుంది. ఈ పదార్థం లోకోవీడ్‌ అనే ఒక రకమైన మొక్క నుంచి వస్తుంది. చూసేందుకు పసుపు రంగులో కనిపిస్తుంది. పటిక బెల్లంలా ఉంటుంది. అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అందుబాటులో ఉంది.

    శరీరానికి చలువ..
    ఈ ఆయుద్వేద ఔషధం శరీరానికి చలువ చేస్తుంది. నీటిలో నానబెట్టినప్పుడు గోండ్‌ కటిర జెల్లీలా మారుతుంది. ఈ జెల్లీ శరీరంలోని నీటి శాతాన్ని పెంచి అధిక చెమటను తగ్గిస్తుంది. సమ్మర్‌ డ్రింక్స్‌లో కూడా గోండ్‌ కటిరను యాడ్‌ చేసుకోవచ్చు. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది. వృద్ధాప్య ఛాయలు, ముఖంపై మచ్చలు డల్‌ స్కిన్‌ తదితర సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం, అతిసార వంటి సమస్యలను కూడా తగ్గుతాయి.

    ఇమ్యూనిటీ బూస్టర్‌..
    ఇక గోండ్‌ కటిర రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్‌. వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. గోండ్‌ కటిరను రాత్రంతా లేదా ఆనలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత తెల్లటి జెల్లీలా మారుతుంది. ఈ జల్లీని నిమ్మరసం, చక్కెర, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాలు, పుదీనా వంటి వాటితో కలిపి తినవచ్చు. నానబెట్టిన గోండ్‌ కటిరను ఫ్రెష్‌ వెజిటేబల్‌సలాడ్స్‌లో కలుపుకుని తీసుకోవచ్చు.

    ఫేస్‌ మాస్క్‌లా..
    ఇక గోండ్‌ కటిర జెల్లీని ఫేస్‌ మాస్క్‌లా కూడా వాడొచ్చు. రోజూ గోండ్‌ కటిర తింటే శారీరక బలహీనత తగ్గుతుంది. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. గోండ్‌ కటిర సహసమైన ఎనర్జీ బూస్టర్‌. శరీరాన్ని ఎనర్జిటిక్‌గా మారుస్తుంది. ఈ గోండ్‌ కటిరను వాడే ముందు ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం కూడా మంచింది.