Ayodhya : అయోధ్యలోని రామ మందిరంలో రామ నవమి సందర్భంగా ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు(Sun light ‘సూర్య తిలకం‘ రూపంలో ఐదు నిమిషాల పాటు ప్రకాశించాయి. ఈ అరుదైన సంఘటన భక్తులను ఆనందంలో ముంచెత్తింది, శాస్త్రీయ, ఆధ్యాత్మిక సమన్వయానికి ప్రతీకగా నిలిచింది.
Also Read : ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ
అత్యాధునిక టెక్నాలజీతో..
ఈ సూర్య తిలకాన్ని(Sury thilakam) సాధ్యం చేయడానికి భారతీయ శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. దీని కోసం ఒక ప్రత్యేక ఆప్టికల్ వ్యవస్థను రూపొందించారు. ఇందులో కణుపులు, గాజు గొట్టాలు, అద్దాలు ఉపయోగించి సూర్య కిరణాలను ఖచ్చితంగా రాముడి నుదుటిపైకి మళ్లించారు. ఈ వ్యవస్థను భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నిపుణుల సహకారంతో అభివృద్ధి చేశారు. రామ నవమి(Rama Navami) రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడి స్థానాన్ని లెక్కించి, ఈ దృశ్యాన్ని సాకారం చేశారు. ఈ ఘటన కేవలం శాస్త్రీయ విజయం మాత్రమే Ascలో కనిపించే ఈ ఫోటోలు, వీడియోలు లేదా ఇతర మీడియా ఫైళ్లు ఈ వికీపీడియా పేజీలో ఉపయోగించబడ్డాయి.
కిటకిటలాడుతున్న అయోధ్య..
ఇదిలా ఉంటే శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా రామాలయాల్లో కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రామ నవమి రోజు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు సుమారు 20 లక్షల మంది భక్తులు అయోధ్యకు వెళ్లారు. దీంతో అయోధ్య వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సూర్యుని కిరణాలు బాలరాముడిని తాకిన సమయంలో ఆలయంలో ఉన్న భక్తులు ఈ దృశ్యాన్ని చూపి పారవశ్యంతో జైశ్రీరామ్ అంటూ నినదించారు.
సోషల్ మీడియాలో వైరల్..
సూర్య కిరణాలు రాముడిని తాకిన దృశ్యాల వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఆప్టికల్ వ్యవస్థ రామ నవమి పర్వదినాన ఏటా ఈ అద్భుతాన్ని పునరావృతం చేసేలా రూపొందించబడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం, సంస్కృతి కలయికకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది.
శ్రీరామనవమి వేళ అయోధ్య శ్రీరాముడి నుదుటిపై సూర్యకిరణాలతో తిలకం
ఐదు నిమిషాల పాటు రాముడి నుదుటిపై సూర్య తిలకం#ayodhyarammandir #sreeramanavami pic.twitter.com/BhnjEeveOy
— BIG TV Breaking News (@bigtvtelugu) April 6, 2025