Toyota HiAce : లోపలికి అడుగుపెడితేనే విశాలమైన క్యాబిన్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎంతో అందమైన డాష్‌బోర్డ్, మల్టీఫంక్షనల్ యూరేథేన్ స్టీరింగ్ వీల్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. 14 సీట్ల వేరియంట్‌లో ఏకంగా 12 కప్ హోల్డర్‌లు , విశాలమైన కార్గో స్పేస్ లగేజీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది.
Also Read : లోపల సీట్లు చూస్తే దిగిపోవాలనిపించదు.. తగ్గేదే లే అంటున్న ఎంజీ
ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టివిటీ విషయానికి వస్తే, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లతో మీ ప్రయాణంలో వినోదం నిరంతరంగా ఉంటుంది. సౌకర్యవంతమైన క్లాత్ సీట్లు,ఎక్కువ లెగ్‌రూమ్ ఉండటం వల్ల లాంగ్ జర్నీలు కూడా ఎటువంటి అలసట లేకుండా హాయిగా సాగిపోతాయి. కావాలంటే సీట్లను వినైల్ అప్హోల్స్టరీతో కూడా మార్చుకోవచ్చు.
ఇంజిన్ విషయానికి వస్తే, 3.5-లీటర్ గ్యాసోలిన్, 2.8-లీటర్ డీజిల్ అనే రెండు శక్తివంతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మంచి మైలేజ్‌తో పాటు అవసరమైన శక్తిని అందిస్తాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఇతర ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఈ బస్సులో ఉన్నాయి.
మొత్తం మీద, 2025 టయోటా హైఏస్ బస్సు లగ్జరీ ఇంటీరియర్, అద్భుతమైన ఫీచర్లతో మీ ప్రతి ప్రయాణాన్ని ఒక మరపురాని అనుభవంగా మారుస్తుంది. పెద్ద కుటుంబాలకు , టూరిజం వ్యాపారానికి ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి అని చెప్పవచ్చు.
Also Read : సియెర్రా EV వస్తోంది బిడ్డా.. క్రెటాకి ‘టాటా’ చెప్పే టైమ్ దగ్గరలోనే ఉంది!
This is real! pic.twitter.com/qdpdkbRQq9
— Xavier ✞ (@RealXavier011) April 5, 2025