https://oktelugu.com/

Diwali Gift To Electricity: విద్యుత్ వినియోగదారులకు దీపావళి కానుక.. ఆ ఛార్జీల పెంపు లేనట్లే..

దీపావళి పర్వదినం సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత కొద్ది రోజుల కింద విద్యుత్ ఛార్జీలు పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది

Written By:
  • Srinivas
  • , Updated On : October 29, 2024 11:45 am
    Diwali-Gift-To-Electricity

    Diwali-Gift-To-Electricity

    Follow us on

    Diwali Gift To Electricity: దీపావళి పర్వదినం సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత కొద్ది రోజుల కింద విద్యుత్ ఛార్జీలు పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనున్నట్లు పేర్కొంది. దీంతో విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనాలు కలగనున్నాయి. ఇప్పటికే గృహజ్యోతి పథకం కింది 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా గృహ జ్యోతికి అర్హులు కాని వారికి సైతం లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1200 కోట్ల ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సి)కి ప్రతిపాదదించాయి. అయితే ఈ ప్రతిపాదనలను స్వీకరించిన ఈ ఆర్సీ రూ.30 కోట్ల వరకు ఛార్జీల సవరణకు అనుమతి ఇచ్చింది. మిగతా రూ.1170 కోట్ల వరకు ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. అయితే ఈ మొత్తం వినియోగదారులపై భారం వేయాలని భావించిన డిస్కంల ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు సోమవారం విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఉత్తర్వులను జారీ చేశారు.

    తాజాగా నిర్ణయించిన ప్రకారం విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనాలు కలగనున్నాయి. గృహ జ్యోతి పథకం కింద లేని విద్యుత్ వినియోగదారులు గతంలో విద్యుత్ వాడకం లేకున్నా.. కనీసం ఛార్జీ వసూలు చేశారు. కానీ ఇప్పుడు వాటిని ఎత్తేశారు. కానీ 800 యూనిట్లు దాటిని వారికి ప్రస్తుతం ఫిక్స్ డ్ ఛార్జీలు రూ. 10 వసూలు చేస్తుండగా.. దీనిని రూ. 50 కి పెంచారు. వ్యాపార అవసరాలకు వినియోగించే విద్యుత్ లో నెలకు 50 యూనిట్ల లోపు వినియోగిస్తే ఫిక్స్ డ్ ఛార్జీలు రూ. 60 వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు వాటిని రూ.30కి తగ్గించారు. ఇదే కేటగిరి వారికి ఎలాంటి విద్యుత్ ఉపయోగించని వారికి రూ. 50కి తగ్గించారు. త్రీఫేజ్ కనెక్షన్ అయితే రూ. 200 ఉండగా.. రూ.100కి తగ్గించారు.

    విద్యుత్ వాహనాల చార్జీంగ్ స్టేషన్లకు ప్రస్తుతం రూ. 50 ఫిక్స్ డ్ ఛార్జీలు వసూలు చేస్తుండగా వాటిని రద్దు చేశారు.అలాగే గ్రిడ్ సపోర్ట్ ఛార్జీని రూ.19.37 చొప్పున వసూలు చేస్తామని డిస్కంలు ప్రతిపాదించాయి. దీనిని తిసర్కించి రూ. 16.32కి ఆమోదం తెలిపారు. విద్యుత్ బకాయిలు వసూలు చేసే క్రమంలో ఒకరోజు ముందుగా నోటీసులు జారీ చేస్తే వారి నుంచి స్టాండ్ బై ఛార్జీలు వసూలు చేయరాదని ఈఆర్సీ తెలిపింది. అలాగే నోటీసు ఇవ్వకపోతే వారి నుంచి రూ.10 శాతం అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది.

    తాజాగా చేసిన విద్యుత్ సవరణలతో ప్రభుత్వంపై అదనంగా నిధుల భారం పడనుంది. ఇప్పటికే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ రాయితీ విలువ రూ.11,499 కోట్లు ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 26 శాతం అదనంగా ఉంది. అయితే రాయితీ 26 శాతం పెరగడం వల్ల మొత్తం టారిఫ్ లో 0.47 తగ్గుదల కనిపిస్తుందని ఈర్సీ ప్రతినిధులుపేర్కొన్నారు.