Arunachalam : పంచభూత లింగాక్షేత్రాలలో అరుణాచలం దేవాలయం ఒకటి. అరుణాచలంలో తిరువన్నామలై అని కూడా అంటారు.శివాజ్ఞ చేత విశ్వకర్మ నిర్మించిన ఈ ఆలయం చుట్టూ అరుణపురం అనేది ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలం క్షేత్రంలో మహాశివుడు జ్యోతిర్లింగ స్వరూపడై కనిపిస్తాడు. జ్యోతిర్లింగం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతుంటారు. అందుకే అరుణాచలం వెళ్లిన భక్తులు మహా శివుడిని దర్శనానికి ముందు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం, రాత్రి అనే సమయం లేకుండా నిత్యం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అవేంటంటే?
Also Read : గాంధారి తన కళ్ళకు గంతలు ఒక్కసారి కాదు చాలాసార్లు తెరిచింది.. ఎప్పుడంటే?
పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, ఇతర లోకాల్లోని వారు తిరువన్నామలైకి వచ్చి చీమలు, పక్షులు, జంతువుల రూపంలో గిరి ప్రదక్షణ చేస్తారట. అందువల్ల ఈ గిరి ప్రదర్శనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే గిరి ప్రదర్శన కొండ చుట్టూ మొత్తం పడ్డారు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారు ఉదయం మూడు లేదా నాలుగు గంటల సమయంలోనే ప్రారంభించి సూర్యోదయానికి ముందే ముగించాలి. ఎందుకంటే పగటిపూట గిరిప్రదక్షిణ చేయడం వల్ల అలసిపోతారు. పౌర్ణమి రోజున ఎక్కువమంది గిరిప్రదక్షిణ చేస్తారు.
ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండే ఈ ప్రాంతంలో చెప్పులు వేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందలేరని అంటున్నారు. అలాగే ఈ ప్రదక్షిణలో పాల్గొన్నవారు వెంట బరువు వస్తువులు తీసుకెళ్లరాదు. చేతిలో ఏది లేకుండా ప్రదక్షిణ చేయడం మరీ మంచిది. ఉదయం సూర్యుడు రాకముందే గిరి ప్రదక్షిణను ముగించడం మంచిది. ఎందుకంటే పగటిపూట గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అలసిపోతారు. దీంతో ఈ ప్రదక్షిణ పూర్తి చేయలేదు. తిరు ప్రదక్షిణ చేసే సమయంలో ఎలాంటి కోరికలు కోరరాదు. ఎలాంటి ఆలోచన లేకుండా ఈ ప్రదక్షిణ పూర్తి చేయాలి.
గిరిప్రదక్షిణ చేసేవాళ్లు వెంట చిల్లర తీసుకువెళ్లడం మంచిది. ఎందుకంటే దారిలో ఎన్నో ఆలయాలు దర్శనం ఇస్తుంటాయి. అలాగే దానధర్మాలు చేయాలనుకునేవారు ఇంకాస్త ఎక్కువగానే డబ్బు తీసుకెళ్లడం మంచిది. ప్రతిరోజు గిరిప్రదక్షిణ చేస్తారు. కానీ పౌర్ణమి రోజు ఎక్కువగా చేస్తారు. అందువల్ల పౌర్ణమి రోజు చేయాలనుకునేవారు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎన్నో ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. వీటిలో భక్తకన్నప్ప, అన్నా మలై దేవాలయాన్ని తప్పక దర్శించుకోవాలి. ఈ ప్రదక్షిణ సమయంలో ఆలయాలను దర్శించుకుంటే.. అక్కడ విభూది తప్పనిసరిగా తీసుకోవాలి. గిరి ప్రదక్షణ ప్రారంభించేముందు రాజగోపురం ముందు ఒక దీపం ను పెట్టి స్వామివారికి నమస్కరించాలి. అయితే ఏదైనా కోరిక కోరుకుంటే ఇక్కడే చేయండి. ప్రదక్షిణ ప్రారంభించిన తర్వాత శివనామ స్మరణం మాత్రమే ఉండాలి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో తలపై ఎలాంటి వస్త్రం ఉండకూడదు.