Devi Navaratri: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రులను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. మొత్తం 9 రోజుల పాటు ఒక్కో దేవి పేరుతో అమ్మవారిని పూజిస్తారు. అయితే భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా రోజంతా ఉపవాసం ఉంటారు. ఒక రోజు ఉపవాసం అంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది తొమ్మిది రోజుల పాటు ఉపవాసం అంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే నవరాత్రుల్లో ఉపవాసం చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని నమ్ముతారు. అయితే కొందరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి బాడీ డీహైడ్రేట్ అయ్యి ఆకలి చచ్చిపోతుంది. అమ్మవారిని భక్తితో పూజించాలి. కానీ ఆరోగ్యం పాడుచేసుకుని పూజించకూడదు. కాబట్టి ఉపవాసం పాటించేటప్పుడు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. మరి నవరాత్రి ఉపవాస సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.
ఉపవాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నవరాత్రి ఉపవాస సమయంలో పూర్తిగా ఏం తీసుకోకుండా ఉండకూడదు. రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. పూర్తిగా నీరు కూడా తాగకపోతే బాడీ డీహైడ్రేట్ అయ్యి నీరసం అయిపోతారు. అలాగే ఎక్కువ సమయం ఆకలితో ఉండకుండా ప్రతి ఏదో ఒకటి తినాలి. ఈ సమయంలో ఎక్కువగా పండ్లు తీసుకోవాలి. ఉపవాస సమయంలో నీరసంగా అనిపిస్తుంది. ఈ సమయంలో యాక్టివ్‌గా ఉండాలంటే డ్రైఫూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా పాలు, పెరుగు తప్పకుండా తినాలి. వీటివల్ల ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంటుంది. ఉపవాసం సమయంలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. ఇలాంటి సమయంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా తాజా పండ్ల రసాలు, హెర్బల్ టీ, కొబ్బరి నీరు వంటివి తాగాలి. ఇవి తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఉపవాస సమయంలో ఆకలిగా ఉండటం వల్ల అసిడిటీ, తలనొప్పి, నీరసం, ఎలక్ట్రోలైట్ వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త
ఆరోగ్యంగా ఉన్నవారు ఉపవాసం చేయవచ్చు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా డాక్టర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఉపవాసం ఉండాలి. మైగ్రేషన్, రక్తపోటు సమస్యలు, డయాబెటిక్ రోగులు ఉపవాసం ముందే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే మీ సమస్యలు ఇంకా తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణులు అయితే 9 రోజులు ఉపవాసం ఉండటం మంచిది కాదు. దీనివల్ల గర్భిణితో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి కూడా ప్రమాదమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్భిణులు ఉపవాసం ఉండకూడదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని
oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.