Rashid Khan : నిత్య బ్రహ్మచారిగా ఉంటానన్నాడు.. ఆ క్రికెటర్ పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు..

అతడు వేసే బంతులు సుడిగాలి లాగా మెలి తిరుగుతాయి. వికెట్లను వెంటనే పడగొడతాయి.. చూస్తుండగానే నష్టాన్ని చేకూర్చుతాయి. అందువల్లే అతడిని క్రికెట్ చరిత్రలో అత్యంత మ్యాజికల్ బౌలర్ అని పిలుస్తారు. అయితే అతడు ఆడుతోంది దిగ్గజట్టుకు కాదు. కల్లోల ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో.. ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది.. మేము ఎవరి గురించి పై ఉపోద్ఘాతం రాశామో..

Written By: Anabothula Bhaskar, Updated On : October 4, 2024 12:05 pm

Rashid Khan

Follow us on

Rashid Khan : అతడి పేరు రషీద్ ఖాన్. సమకాలిన క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆల్రౌండర్ గా కొనసాగుతున్నాడు. ఆ జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో ఏకంగా సెమీస్ దాకా తీసుకెళ్లాడు. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ విజయాన్ని సాధించేలా చేశాడు. అలాంటి రషీద్ ఖాన్ ఓ ఇంటి వాడయ్యాడు. గతంలో తాను పెళ్లి చేసుకోనని.. ఆ బ్రహ్మచారిగా ఉంటానని రషీద్ ఖాన్ అన్నట్టు వార్తలు వినిపించాయి. కొన్ని సందర్భాల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరల్డ్ కప్ గెలిచేదాక పెళ్లి చేసుకోనని రషీద్ ఖాన్ చెప్పినట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో అందరికీ షాక్ ఇస్తూ 26 సంవత్సరాల రషీద్ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకోనని తన పేరు మీద వ్యాపించిన వార్తలను రషీద్ ఖాన్ పలుమార్లు ఖండించాడు. వివాహం చేసుకున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ కు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్లతో పాటు అభిమానులు అతడికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చెందిన మహమ్మద్ నబి సామాజిక మాధ్యమాల వేదికగా రషీద్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. జీవితాంతం ప్రేమ, సంతోషం, విజయం వంటివి వన్ అండ్ ఓన్లీ కింగ్ రషీద్ కు దక్కాలని కోరికను వ్యక్తం చేశానని నబి తన ట్వీట్ లో వ్యాఖ్యానించాడు. ఇక రషీద్ ఖాన్ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగినట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. రషీద్ ఖాన్ వివాహ సమయంలో సంప్రదాయ ఆఫ్ఘనిస్తాన్ దుస్తులను ధరించాడు. ఆ దుస్తులలో అతడు సరికొత్తగా కనిపిస్తున్నాడు. అతడి వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరఫున రషీద్ ఖాన్ ఐదు టెస్టులు, 105 వన్డేలు, 93 t20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టులలో 106 రన్స్ చేశాడు. 34 వికెట్లు పడగొట్టాడు. వన్డే ఫార్మాట్లో 1322 రన్స్ చేశాడు. 190 వికెట్లు పడగొట్టాడు. ఇక టి20 లలో 460 రన్స్ చేశాడు. 152 వికెట్లు సాధించాడు. అయితే ఇటీవల ఆఫ్గానిస్తాన్ జట్టు చారిత్రాత్మక విజయాలను సాధించింది. అందులో రషీద్ ఖాన్ ముఖ్య పాత్ర పోషించాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లపై ఆహ్వానిస్తాన్ విజయం సాధించింది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జటను ఆఫ్ఘనిస్తాన్ పడగొట్టింది. తాజాగా దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ దక్కించుకుంది. రషీద్ ఖాన్ కు ఐపీఎల్ లోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అతని బౌలింగ్ ను చాలామంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భారతీయ అభిమానులు అతడి బౌలింగ్ ను సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉంటారు. అతడు ఐపిఎల్ ఆడుతున్నప్పుడు.. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీగా నిలిచాడు. వివాహం చేసుకున్న నేపథ్యంలో మన దేశానికి చెందిన చాలామంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.