Char Dham Yatra: భారతదేశంలో ఉత్తరాఖండ్ ను దైవ భూమిగా పేర్కొంటారు. ఇక్కడ చాలా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్రసిద్ధిగాంచినవి గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ నాలుగు క్షేత్రాలు సందర్శిస్తే చార్ ధామ్ యాత్ర అని అంటారు. ముందుగా యమునోత్రికి వెళ్లి ఆ తర్వాత వరుసగా మిగతా ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే చార్ ధామ్ యాత్రలో కేవలం ఈ నాలుగు క్షేత్రాలను దర్శించుకోవడమే కాకుండా అందమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ముఖ్యంగా ఫ్రెండ్స్ తో వెళ్లేవారు ఇక్కడ చాలా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ యాత్రలో ఎలాంటి అందమైన ప్రదేశాలనుచూడవచ్చొ ఇప్పుడు చూద్దాం..
Also Read: బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక.. అసమ్మతి రాజేసిన రాజాసింగ్
చార్ ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, కేదార్నాథ్ కు ట్రెక్కింగ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. గంగోత్రి, బద్రీనాథ్ కు రోడ్డు మార్గాన వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇలా ప్రయాణం చేసి సమయంలో కొన్ని అందమైన ప్రదేశాలను చూడవచ్చు. చార్ధామ్ యాత్రలో భాగంగా పెద్ద పెద్ద కొండలు దర్శనమిస్తూ ఉంటాయి. వీటి పైనుంచి జాలువారే నీటిని చూసి ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. యాత్రలకు వెళ్లే మార్గాన మధ్యలో జలపాతం లో ఆనందంగా గడపొచ్చు. ముఖ్యంగా స్నేహితులతో వెళ్లేవారు ఇక్కడ చాలా ఎంజాయ్ చేయవచ్చు.
ఉత్తరాఖండ్ లో యునెస్కో గుర్తింపు పొందిన వాలి ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ దర్శనమిస్తాయి. వీటి మధ్య ఉండడంవల్ల ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లిన వారు ఈ వ్యాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ తప్పక చూడాలి. అలాగే ఇక్కడ జిమ్ కోర్బెట్ నేషనల్ పార్క్ ఉంటుంది. అలాగే ఇక్కడ రాజాజీ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఈ పార్కుల్లో అరుదైన జంతువులను చూసే అవకాశం ఉంది. భారతదేశంలోనే అతి పొడవైన నాలుగు కిలోమీటర్ల దూరంలో రోప్ వే ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే రెండవ పొడవైన రూప్ వే గా పేరు తెచ్చుకుంది. అలాగే ట్రేకింగ్ చేయాలని అనుకునే వారికి ఇక్కడికి కొండలు ఆహ్లాదాన్ని ఇస్తాయి. చిన్న చిన్న కొండలు ద్వారా ట్రిక్కింగ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక బంగి జంపు చేయాలనుకునే వారికి కూడా ఉత్తరకాండ అనుకూలంగా ఉంటుంది. ఎత్తైన ప్రదేశం నుంచి బంగిజం చేయడానికి అక్కడక్కడ ఏర్పాటు చేశారు.
ఇలా చార్ధామ్ యాత్ర చేసేవారు దైవ క్షేత్రాలు మాత్రమే కాకుండా అందమైన ప్రదేశాలను సందర్శించి మనసుకు ఉల్లాసాన్ని కలిగించవచ్చు. అయితే ఇక్కడికి వెళ్లేముందే ప్రణాళిక వేసుకోవాలి. లేదంటే సమయం వృధా అవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి నిమిషం ట్రిప్ ను ఎంజాయ్ చేయడం ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేశంలో అందమైన ప్రదేశాలు అన్ని ఉత్తరాఖండ్లోనే కనిపిస్తాయి. కొండల మధ్య కనిపించే గ్రామాలు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ గ్రామాల్లో ఉండే ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఉండగలుగుతారు.