Mahesh Rajamouli Movie : నిన్నగాక మొన్ననే ప్రారంభం అయినట్టు అనిపిస్తున్న మహేష్ బాబు(Super Star Mahesh Babu) ,రాజమౌళి(SS Rajamouli) మూవీ షూటింగ్ అప్పుడే 25 శాతం పూర్తి అయ్యిందట. రాజమౌళి సినిమా ఇంత వేగంగా జరుగుతుందా అని మీకు ఆశ్చర్యం వేస్తుంది కదూ. కానీ నిజంగానే అంత వేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఒడిశా లో కొన్ని రోజులు, ఆ తర్వాత హైదరాబాద్ లో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. త్వరలోనే మూడవ షెడ్యూల్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. అందుకోసం శంకర్ పల్లి లో ఉన్నటువంటి కల్కి మూవీ సెట్స్ లో షూటింగ్ ని ప్లాన్ చేశారట. వచ్చే నెల మధ్యలో నుండి ఈ షూటింగ్ జరగనుంది. మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా, మరియు ఇతర ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా రామోజీ ఫిలిం సిటీ లో మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారట.
ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని టాక్. అయితే ఈ సినిమా అధిక శాతం ఒడిశా బ్యాక్ డ్రాప్ లోనే జరగనుంది. కాబట్టి మరో రెండు షెడ్యూల్స్ ని అక్కడ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారట. షూటింగ్ అయితే రాజమౌళి కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్తి అయిన సినిమాగా ఇది నిలుస్తుందని అందరూ అంటున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ మాత్రం చాలా ఉంటుందట. ఇప్పటి వరకు రాజమౌళి కెరీర్ లో ఏ సినిమాకు ఉపయోగించనంత టెక్నాలజీ మరియు VFX వర్క్ ఈ సినిమాకు ఉపయోగించబోతున్నాడట. ఇప్పటికే షూట్ చేయబడిన సన్నివేశాలకు సంబంధించిన VFX వర్క్ ని మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ లో ఒక సరికొత్త విప్లవం తీసుకొచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రాజమౌళి ఎన్నో అద్భుతమైన విజువల్స్ ని మన ముందుకు తీసుకొని రాబోతున్నడాట.
ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రపంచం లో సినిమాని ఇష్టపడే ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని చూసి ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని పొందుతారని అంటున్నారు మేకర్స్. #RRR చిత్రం తో ఇప్పటికే రాజమౌళి మన తెలుగు సినిమాకు మార్కెట్ ని ఓపెన్ చేసాడు. ఆ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం వల్ల మన తెలుగు సినిమాకు మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకు కూడా సరికొత్త గౌరవం దక్కింది. అది కేవలం టీజర్ మాత్రమే, మహేష్ తో చేయబోయేది అసలు సిసలు సినిమా అని అంటున్నారు. ఈ చిత్రం తో రాజమౌళి హాలీవుడ్ టాప్ గ్రాసర్స్ ని కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ ఇంకెన్ని వండర్స్ ని క్రియేట్ చేయబోతుంది అనేది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట.