https://oktelugu.com/

Amavasya: పూర్వీకుల ఆశీస్సులు లభించాలంటే.. మార్గశిర అమావాస్య రోజు పెద్దలకు ఇలా పూజించాల్సిందే!

అమావాస్య రోజు ఉదయాన్నే లేచి అన్ని వంటలు చేసి పెద్దలకు పూజ చేస్తారు. అయితే ఈ మార్గశిర అమావాస్య నాడు పెద్దలను భక్తితో పూజిస్తే వారి ఆశీర్వాదం లభిస్తుంది. మరి ఎలా పూజిస్తే ఆశీర్వాదం లభిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 30, 2024 / 02:56 AM IST

    Pujas

    Follow us on

    Amavasya: హిందూ సంప్రదాయంలో ప్రతీ దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏడాది అంతా వచ్చే అన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పూజలు నిర్వహిస్తారు. అయితే హిందువులు ఎక్కువగా పౌర్ణమి, అమావాస్యలను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ముఖ్యంగా అమావాస్య సమయాల్లో అయితే పెద్దలను పూజిస్తారు. సాధారణంగా ప్రతీ నెల ఒక అమావాస్య వస్తుంది. ఏడాది మొత్తం ఉండే అమావాస్యలలో కొన్ని అమవాస్యలు చాలా ప్రత్యేకమైనవి. అందులో ఈ డిసెంబర్ 1న వచ్చే మార్గశిర అమావాస్య కూడా చాలా ముఖ్యమైనది. ఈ అమావాస్య రోజు భక్తితో పూజించాలి. అయితే హిందువులు ప్రతీ అమావాస్యకు పెద్దలను తప్పకుండా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆశీర్వాదం అందుతుందని భావిస్తారు. ఈ అమావాస్య రోజు ఉదయాన్నే లేచి అన్ని వంటలు చేసి పెద్దలకు పూజ చేస్తారు. అయితే ఈ మార్గశిర అమావాస్య నాడు పెద్దలను భక్తితో పూజిస్తే వారి ఆశీర్వాదం లభిస్తుంది. మరి ఎలా పూజిస్తే ఆశీర్వాదం లభిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.

    మార్గశిర అమావాస్య రోజు పెద్దలను పూజించడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుంది. వారి ఆశీస్సులు ఉంటే కుటుంబంలో సంపద వృద్ధి చెందుతుందని కొందరు నమ్ముతారు. ఈ రోజు పెద్దలకు పిండ ప్రదానం చేయాలి. అలాగే దానం కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల వారి ఆశీర్వాదాలు మనకి ఎల్లప్పుడూ అందుతాయి. ఈ అమావాస్య రోజు పేదవాళ్లకు, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడంతో పాటు మీ స్తోమత బట్టి వస్తువులను దానం చేయండి. ఈ అమావాస్య రోజు వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి. అలాగే ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారని పండితులు అంటున్నారు. అయితే ఈ మార్గశిర అమావాస్య నాడు మేష రాశి వారు రాజ్మా, రాగులు, వేరుశెనగలు, బెల్లం వంటి వాటిని దానం చేయాలి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు.

    మార్గశిర అమావాస్య నాడు వృషభ రాశి వారు పెరుగు, జున్ను, పాలు, వెన్న వంటి పాల పదార్థాలను దానం చేయడం వల్ల ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. అలాగే మిథునరాశి వారు అమావాస్య రోజు పచ్చి కూరగాయాలు, పచ్చి పెసరలు, పండ్లు దానం చేయడం వల్ల పెద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాలు అందుతాయి. కర్కాటక రాశి వారు గోధుమలు, గోధుమ పండి, ఉప్పు, బియ్యం, పంచదార వంటివాటిని దానం చేయడం మంచిదట. సింహ రాశి వారు అయితే పప్పు, ఎర్ర మిరపకాయలు, గోధుమలు, రాగులు వంటి వాటిని దానం చేయాలి. కన్యా రాశి వారు గోశాలకు డబ్బులు దానం చేయడం, గోవులకు పెసరపప్పు, క్యాప్సికమ్ తినిపించడం వంటివి చేయాలి. తులారాశి వాళ్లు తెలుపు రంగు దుస్తులు, గోధుమ పిండి వంటి వాటిని ఇవ్వాలి. వృశ్చిక రాశి వారు అయితే రాగులు, ఎర్ర పప్పు, చిలగడ దుంపలు ఇవ్వాలి. ధనుస్సు రాశి వారు బాగా పండిన అరటి పండ్లు, శనగపిండి, బొప్పాయి వంటి వాటిని దానం చేయాలి. అలాగే మకర రాశి వారు నువ్వులు, అవిసె గింజలను, కుంభ రాశి వారు చెప్పులు, నల్లటి దుప్పట్లను, మీన రాశి వారు మొక్కజొన్నలు, పండిన అరటి పండ్లు వంటి వాటిని దానం చేయాలని పండితులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.