https://oktelugu.com/

Devotional:ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేయడం ఫిక్స్!

వాస్తును సరిగ్గా పాటించడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి.. జీవితం సాఫీగా సాగుతుందని నమ్ముతారు. అయితే చాలా మందికి తెలియక ఇంట్లో చేసే కొన్ని తప్పులు వల్ల పెదరికాన్ని అనుభవిస్తారని పండితులు అంటున్నారు. మరి ఇంట్లో చేసే ఏ తప్పుల వల్ల పేదరికాన్ని అనుభవిస్తారో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 30, 2024 / 02:22 AM IST

    luck

    Follow us on

    Devotional: హిందూ మతంలో కొన్ని ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. వీటిని తప్పకుండా పాటించడం వల్ల మంచి జరుగుతుందని, ఇంట్లో డబ్బులు నిలకడగా ఉంటాయని భావిస్తారు. పొరపాటున మనం చేసే చిన్న తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండిపోతుంది. కొందరు తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల పేదరికాన్ని అనుభవిస్తారు. ప్రతీ ఒక్కరూ ఇళ్లు నిర్మించుకునే ముందు తప్పకుండా వాస్తును పాటిస్తారు. ఇలా పాటించడం వల్ల ఇంటికి అదృష్టం వస్తుందని భావిస్తారు. కొందరు వాస్తు నియమాలు పాటించకుండా ఉంటారు. అలాంటి వారి ఇంట్లో దరిద్ర దేవత ఉండటం వల్ల కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే సనాతన ధర్మంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందువులు తప్పకుండా వాస్తును పాటిస్తారు. అసలు ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు పెట్టాలన్నా కూడా వాస్తును పాటించకుండా ఉండేలేరు. ఇలా వాస్తును సరిగ్గా పాటించడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి.. జీవితం సాఫీగా సాగుతుందని నమ్ముతారు. అయితే చాలా మందికి తెలియక ఇంట్లో చేసే కొన్ని తప్పులు వల్ల పెదరికాన్ని అనుభవిస్తారని పండితులు అంటున్నారు. మరి ఇంట్లో చేసే ఏ తప్పుల వల్ల పేదరికాన్ని అనుభవిస్తారో ఈ స్టోరీలో చూద్దాం.

    ఇంట్లో లక్ష్మీదేవి ఉండి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాంటే మొదటి చేయాల్సిన పని ఉదయం తొందరగా లేవడం. చాలా మంది ఉదయం కూడా ఆలస్యంగా లేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. గ్రామంలో ఉన్నవారంత బద్ధకం కూడా మీకు వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే వేకువ జామునే లేచి ఇంట్లో దీపాలు పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఎవరైతే ఆలస్యంగా లేస్తారో వారు ఎప్పుడూ కూడా కటిక పేదరికాన్ని అనుభవిస్తారట. కాబట్టి ఎట్టి పరిస్ధితుల్లో కూడా ఈ తప్పులు చేయవద్దు. ఉదయం సూర్యోదయానికి ముందు లేవడం అలవాటు చేసుకోండి. సాధారణంగా అందరికి చెప్పులు ఎక్కువ జతలు ఉంటాయి. వీటిలో కొన్ని తెగిపోయినవి, విరిగిపోయినవి కూడా ఉంటాయి. వీటిని పడేయకుండా అలా ఉంచుకుంటారు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని పండితులు అంటున్నారు. అలాగే చెప్పులను తిరగేసి ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి పాడైన చెప్పులు కాకుండా మంచిగా ఉండే చెప్పులను మాత్రమే ఇంట్లో ఉంచుకోండి.

    కొందరు ఇళ్లలో ట్యాప్‌ల నుంచి చుక్కా చుక్కా వాటర్ వస్తుంటుంది. ఇలా వాటర్ పడటం వల్ల చిన్న సౌండ్ కూడా వినిపిస్తుంది. అయితే ఇలా వాటర్ పడటం అంత మంచిది కాదట. ఇళ్లంతా నిశ్శబ్ధంగా ఉంటే వాటర్ ట్యాప్ నుంచి ఇలా పడితే వెంటనే ఆ సమస్యను క్లియర్ చేయండి. అలాగే తలుపులను ఎక్కువగా శబ్ధం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్లిపోతుందట. అలాగే పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఇంట్లో ఉంచకూడదు. వీటివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొందరు ఇంట్లో అసలు దీపం పెట్టరు. పూజలు నిర్వహించరు. ఇలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. అలాగే మంగళవారం, గురువారం, పూజలు వంటి రోజుల్లో గోళ్లు, జుట్టు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోయి.. దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయవద్దు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.